గ్రామాన్ని దత్తత చేసుకున్న సచిన్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని ఒక కుగ్రామాన్ని దత్తత చేసుకుని దాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఏమ్పీలంతా గ్రామాలను దత్తత చేసుకుని అభివృద్ధి చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు స్పందించిన సచిన్ తన దృష్టిని నెల్లూరు జిల్లా వైపు మళ్ళించారు. ఈ జిల్లాలో గూడూరు మండలంలో ఉన్న పుత్తమరాజు కండ్రిక అనే గ్రామాన్ని ఆయన దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ జిల్లా అధికారులను కలుసుకుని చర్చించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కండ్రికను అభివృద్ధి చేయడానికి ఆయన నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. ఈ నిధులతో ఆయన ఈ గ్రామాన్ని సుందరంగా తీర్చి దిద్దడంతో పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమకూర్చబోతున్నారు. ఈ గ్రామ జనాభా సుమారు ఆరు వందలు. ఈ గ్రామం అటవీ ప్రాంతాన్ని తలపిస్తుంటుంది. ఇది ఎటువంటి అభివృద్ధికీ నోచుకోలేదు. ఆయన ఇటీవల ప్రధానిని కలుసుకుని తన ఆలోచనను ఆయనకు వివరించి ఆయన అభినందనలు అందుకున్నారు. జిల్లా అధికారుల నుంచి అభివృద్ధి నివేదికలు అందుకున్న వెంటనే, కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

Send a Comment

Your email address will not be published.