చంద్రబాబు-పవన్ భేటీ

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ నటుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాన్ గురువారం రాత్రి విజయవాడలో దాదాపు రెండున్నర గంటల సేపు చర్చలు జరిపారు. వారు ప్రధానంగా మూడు అంశాలపై చర్చించినట్టు తెలిసింది. అమరావతిపై దృష్టి కేంద్రీకరిస్తూ, రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారా? రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరిస్తున్నారా? విశాఖ ప్రాంతంలో గిరిజనుల ప్రయోజనాలను పట్టించుకోకుండా బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నారా అనేవి ఈ అంశాలు. ముఖ్యమంత్రి ఆయా అంశాలపై పవన్ కు సవివరంగా తెలియజేసినట్టు సమాచారం. సీమకు పెద్ద పీత వేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అలాగే అమరావతి కోసం రైతులు తమకు తాముగా భూములు ఇస్తున్న వివరాలు ఆయన తెలిపారు. గిరిజనులు అంగీకరిస్తేనే తవ్వకాలు జరుపుతామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాను ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగిందీ కూడా ముఖ్యమంత్రి పవన్ కు తెలిపారు. ఆ తరువాత పవన్ విలేఖరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం తన దగ్గర అంత డబ్బు లేనందువల్ల ప్రస్తుతం జనసేనాను పార్టీగా మార్చడం లేదని చెప్పారు. 2019 ఎన్నికల నాటికి పార్టీగా మారి ఎన్నికల్లో పాల్గొంటామని కూడా ఆయన చెప్పారు.

Send a Comment

Your email address will not be published.