చంద్రబాబు మిషన్-7

వివిధ శాఖలకు పూర్తి స్థాయిలో కార్యాలయాలు ఏర్పడనప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనదయిన శైలిలో నాయుడు పాలనా బాధ్యతల్లోకి దిగిపోయారు. వివిధ రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఆయన పెద్దఎత్తున పథకాలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో మౌలిక సౌకర్యాలు, పరిశ్రమలు, సేవా రంగం, పట్టణాభివృద్ధి, నైపుణ్యాల అభివృద్ధి, ప్రాథమిక రంగం, సామాజిక అభివృద్ధి వంటి వాటి కోసం ఆయన రెండు మూడు రోజుల్లో మిషన్-7 పేరుతో ఓ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఈ ఏడూ మిషన్లకు ఆయా శాఖల మంత్రులు వైస్ చైర్మన్లుగా ఉంటారు. ఆ శాఖల ముఖ్య కార్యదర్శులు కన్వీనర్లుగా ఉంటారు. ఇది అభివృద్ధి దిశగా ఏడడుగులు కాబోతోందని ఆయన భావిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నిటినీ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి కూడా ఆయన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.