చంద్రబాబు రష్యా పర్యటన

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న రష్యా బయలుదేరి వెడుతున్నారు. ఆయన ఈ నెల 14 వరకు రష్యా, కజఖ్ స్థాన్ లలో పర్యటిస్తారు.
ఆయనతో పాటు 12 మంది సభ్యుల ఉన్నత స్థాయి అధికార బృందం కూడా వెడుతోంది.

ఆయన తన బృందంతో పాటు అక్కడి పారిశ్రామిక, వాణిజ్య దిగ్గజాలతో సమావేశం అవుతారు. అక్కడి ఏక్టరిన్ బర్గ్ లో జరిగే అంతర్జాతీయ పారిశ్రామిక వాణిజ్య సమాఖ్య సదస్సులో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సదస్సులో పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వం ఆయనతో పాటు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కూడా ఎంపిక చేసింది.

Send a Comment

Your email address will not be published.