చంద్రబాబు సింగపూర్ పర్యటన

రాష్ట్రంలో పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలు స్థాపించడానికి ముందుకు రావాల్సిందిగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. “రాష్ట్రంలో పుష్కలంగా నీటి వనరులు, నాణ్యమయిన రోడ్లు, నిరంతర విద్యుత్తు ఉన్నాయి. వీటితోపాటు పారదర్శక పాలన, త్వరితగతిన అనుమతులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన ఆకర్షణ. వినూత్నమయిన పథకాలతో ముందుకు రండి. రాజధాని నిర్మాణంలోనూ భాగస్వాములు కండి” అని ఆయన అక్కడ పారిశ్రామికవేత్తల సమావేశంలో కోరారు.

ఆయన తన మూడు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. “సింగపూర్ మేధావులు, పరిశోధకుల ఆలోచనలు తెలుసుకునేందుకే నేనిక్కడికి వచ్చాను. పీవీ నరసింహా రావు తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక సంస్కరణలను చేపట్టింది నేనే. నా కృషి వల్లే అంతర్జాతీయంగా రాష్ట్రానికి పేరు వచ్చింది” అని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణంతో పాటు, మూడు స్మార్ట్ సిటీలను కూడా నిర్మిస్తున్నామని, ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నామని, వెనువెంటనే అనుమతులు మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు.

రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయడానికి కూడా సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఆయన తన పర్యటన ముగించుకుని శనివారం నగరానికి తిరిగి వచ్చారు.

Send a Comment

Your email address will not be published.