చెత్త ఏరేవారికి జాతీయ అవార్డు

చెత్త ఏరుకునే వారిని ఇక చిన్న చూపు చూడ వద్దని కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలను ఎంపిక చేసి అక్కడ చెత్త ఏరే వారికి జాతీయ పురస్కారాలను అందజేయాలని నిర్ణయించింది. అందులో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు కూడా ఉన్నాయి.
ఉత్తమ సేవలు అందించిన ముగ్గురు కార్మికులకు, మూడు సంఘాలకు జాతీయ పురస్కారంతో పాటు ఒకటిన్నర లక్షల రూపాయల నగదు బహుమతి కూడాస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ఈ పురస్కారాలు, బహుమతులకు తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాలని ఆయన కోరారు. వ్యర్థాల నిర్వహణ కోసం జాతీయ స్థాయిలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది.

వ్యర్థాల నిర్వహణకు ప్రతి ఊరిలోనూ ఒక ప్లాంటును రాష్ట్రాలు ఏర్పాటు చేయబోతున్నాయి. దేశంలో ఏడాదికి 62 మిలియన్ టన్నుల వ్యర్థాలు పేరుకు పోతున్నాయి. ఇది 2050 నాటికి 450 మిలియన్ టన్నులకు చేరుకునే అవకాశం ఉంది.
కాగా ఈ 62 మిలియన్ టన్నులలో 68 శాతం చెత్తను తొలగించలేని పరిస్థితిలో ఉన్నాం.

Send a Comment

Your email address will not be published.