రాష్ట్రాభివృద్ధిలో భాగంగా తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ చంద్ర శేఖర రావు గారు 12 మంది సభ్యులతో కూడిన బృందంతో వారం రోజుల పర్యటనకు చైనా వెళ్లారు. ఈ బృందంలో మంత్రులు శ్రీ జూపల్లి, జగదీష్ రెడ్డిలు ఉన్నారు. రాష్ట్ర ప్రిన్సిపాల్ కార్యదర్శి (పరిశ్రమలు) శ్రీ అరవింద్ కుమార్, తెలంగాణా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జయేష్ రంజన్ ఉన్నారు. తెలంగాణా రాష్ట్రానికి సరిక్రొత్త పారిశ్రామిక విధానం రూపొందించిన నేపధ్యంలో ఈ పర్యటన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఈ పర్యటనలో అనేక మంది పారిశ్రామిక వేత్తలను కలవడమే కాకుండా అక్కడి పారిశ్రామిక వాడలను పర్యటించడం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనడం చేస్తారు. వచ్చే ఐదేళ్ళలో తెలంగాణా రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణలో దేశంలోనే మొదటి స్థానాన్ని సంపాదించాలన్న ఆకాంక్షను శ్రీ కె సి ఆర్ వ్యక్తిపరిచారు.
ఈ పర్యటనలో చైనా లో వ్యవసాయం, పారిశ్రామికీకరణ అభివృద్దిని పరిశీలించి అదే విధమైన పద్ధతులను తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి అమలు చేయడానికి సన్నాహాలు చేయవచ్చని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఆర్ధికంగా ఎంత లాభం చేకూరుతుందన్నది ఇంకా అంచనా వేయకపోయినా షుమారు లక్షకు పైగా ఉద్యోగాలు సంకూరుతయన్నది ఒక అంచనా.
ఒక ప్రత్యెక విమానాన్ని రెండు కోట్ల రూపాయలకు పైగా అద్దె ఖర్చుతో ఈ పర్యటనకు వృధా చేస్తున్నారన్న విమర్శలు పలు వార్తా పత్రికలు ప్రచురించాయి.