జగన్ కి బెయిల్

సమారో త్సాహం లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్

ఆక్రమాస్తుల కేసు లో నిందితుడు గా పదహారు నెలలు గా చంచల్ గూడ జైలు లో ఉన్న వై.ఎస్.జగన్ కి నాంపల్లి సి.బి.ఐ. ప్రత్యెక కోర్టు సోమ వారం బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు వ్యక్తుల రెండు లక్షల రూపాయల పూచీకత్తు, హైదరాబాద్ ని విడిచి వెళ్ళ కూడదు, సాక్షులును ప్రభావితం చేయకూడదు అన్న షరుతుల తో కూడిన బెయిల్ ని జగన్ కి కోర్టు మంజూరు చేసింది. కోర్టు నుండి జగన్ మంగళ వారం సాయంత్రం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

జగన్ కి కోర్టు బెయిల్ మంజూరు చేయడం తో రాష్ట్ర వ్యాప్తం గా వై.ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో మునిగి పోయింది.రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న కార్యకర్తలు స్వీట్లు పంచి బాణా సంచా కాల్చి తమ సంతోషాన్ని పంచుకొంటున్నారు.

దేవుడి ఆశీస్సులు
అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎంత కుట్రలు చేసినా దేవుడి ఆశీస్సులు ఉండడం వల్లనే జగన్ కి బెయిల్ వచ్చిందని జగన్న విడిచిన బాణం సోదరి షర్మిల అన్నారు

ప్రజల కు కృతజ్ఞతలు
మహానేత వై.ఎస్.ఆర్.మరణం తర్వాత , జగన్ అరెస్ట్ వంటి క్లిష్ట సమయం లో కూడా తమ కుటుంబాన్ని అంటిపెట్టుకొని అండగా నిలిచి అభిమానాన్ని, ప్రేమని పంచిన తెలుగు ప్రజల అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని వై.ఎస్.విజయ లక్ష్మి అన్నారు.

పిల్లలు ఎదురు చూస్తున్నారు
పదహారు నేలలు గా తండ్రి కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు. జగన్ కి బెయిల్ వచ్చిందని ఫోన్ చేసి చెప్పగానే ఆనందం తో ఏడ్చారని జగన్ భార్య భారతి అన్నారు

Send a Comment

Your email address will not be published.