జపనీస్ బాషలోకి 'బాద్ షా'

సౌత్ ఇండియా  సూపర్ స్టార్ రజనీ కాంత్. బాద్షా ఒక్కసారి చెపితే వందసార్లు చెప్పినట్టు అనే ఆయన పవర్ ఫుల్ డైలాగ్ లకి ఇండియా తో పాటు జపనీయులు కూడా పడి పోయారు. రజనీకాంత్ సినిమాలు అక్కడ  ఫుల్ క లెక్షన్ లతో నడుస్తాయి. అంతే కాదు రజనీకాంత్ కోసం అక్కడ ప్రత్యేకం గా అభిమాన సంఘాలు కూడా వెలిసాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత మరో నటుడు జపనీయుల అభిమానం పొందాడు. ఆయన మన తెలుగు నటుడు జూ. ఎన్ టి ఆర్.  అంతే కాదు త్వరలో జపాన్ వెండి తెర పై  జూనియర్ ఎన్ టి ఆర్ ని జపనీయులు చూడనున్నారు. ఎన్టీఆర్ నటించిన బాద్ షా , సింహాద్రి, యమదొంగ, స్టూడెంట్ నెంబర్ 1 వంటి పలు చిత్రాలు జపాన్ భాష లోకి డబ్ కానున్నాయి. జూనియర్ డాన్సు లు, నటన, ఫైటింగ్ లు    అక్కడ యూత్ కి విశేషం గా నచ్చడం తో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జపాన్ నేషనల్ చానల్  పుజీ టీవీ  జూనియర్ పైన ప్రత్యేకం గా ఒక డాక్యుమె టరీ  ప్రదర్శించింది.  అప్పుడు ఎన్ టీఆర్  ని  ప్రత్యేకం గా ఇంటర్వ్యూ కూడా చేసింది. తాజా గా బాద్షా అనువాద హక్కులు తీసుకుంది. త్వరలో మిగిలిన సినిమాలు కూడా అనువాదం చేయనున్నారు. అంతేకాదు ఈ ఏడాది మే,  జూన్ లో జపాన్ లో ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్టివల్ కి ఎన్ టీ ఆర్ ని ముఖ్య అతిధి గా ఆహ్వానించారని సమాచారం.

Send a Comment

Your email address will not be published.