జబర్దస్త్ టీం వచ్చేసింది.

జబర్దస్త్ టీం వచ్చేసింది.

ఇంకో 3 గంటల్లో మెల్బోర్న్ లో మొదలవ బోతోంది.  చలాకి చంటి, జబర్దస్త్ శ్రీను మరియు జబర్దస్త్ సుధాకర్ మెల్బోర్న్, పెర్త్ మరియు సిడ్నీ నగరాల్లో తమ పసందైన నవ్వుల జల్లులతో  “జబర్దస్త్” ప్రదర్శన ఇవ్వబోతున్నారు.  వీరితో పాటు ఫోటోగ్రాఫర్ రాహుల్ కూడా రావడం జరిగింది.

చిన్నప్పటినుండి అంచెలంచెలుగా వివిధ వెండి తెర సీరియల్స్ లో బాల నటులుగా ప్రదర్శనలిస్తూ తెలుగు లో హాస్యానికి కొదవ లేదని చాటి చెప్పే విధంగా “జబర్దస్త్” కార్యక్రమానికి రూపుదిద్దారు.  శ్రీను, సుధాకర్ తెలుగుమల్లితో  మాట్లాడుతూ ప్రేక్షుకుల్ని ఆకట్టుకోవడానికి ప్రతీ రోజు మన మధ్య జరిగే సన్నివేశాలను తీసుకొని అందరూ అనుకునే విధంగా కాకుండా భిన్నంగా ప్రదిర్సిస్తామని అందుకే ఈ కార్యక్రమానికి మంచి ప్రోత్సాహం లభించిందని తెలిపారు. మెల్బోర్న్ తెలుగువారు  కళలను పోషించి ప్రోత్సహిస్తారని విన్నామని మా ప్రదర్శనకు ఆదరణ లభించగలదని ఎదురు చూస్తున్నట్లు చలాకి చంటి చెప్పారు.

ప్రతీ వారం బుల్లి తెరపై ఎన్నో కార్యక్రమాలను ప్రదర్శించామని అయితే    మెల్బోర్న్ నగరంలో మొట్టమొదటిగా చేస్తున్న ఈ కార్యక్రమం ఒక పెద్ద సవాలుగా తీసుకుంటున్నామని శ్రీ చంటి చెప్పారు.  తెలుగు వారందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయగలరని ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ చందు నాగమల్లి విజ్ఞప్తి చేసారు.

Send a Comment

Your email address will not be published.