"జబర్దస్త్" రాకేశ్ తో కాన్బెర్రా ఉగాది

గడచిన వారాంతం ఏప్రిల్ 18వ తేది కాన్బెర్ర నగరంలో తెలుగు సంవత్సరాదిమన్మధ నామ సంవత్సరఉగాది సంబరాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగు వారి సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆహ్లాదకరమైన వాతావరణాన  “ఆల్బర్ట్ హాల్” లో జరిగాయి. రాజధాని నగరం కాన్బెర్ర రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిధులుగా విచ్చేసి ఉగాది కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.

భారత దేశం నుండి టీవీలో ప్రముఖులైనజబర్దస్త్రాకేశ్ గారు విచ్చేసి ప్రేక్షకులను తన హాస్య వల్లరితో ఆద్యంతం నవ్వుల పువ్వులు పండించారు. పిల్లలు పెద్దలు ఎంతో ఆసక్తిగా ఈ ఉగాది వేడుకలలో పాల్గొని జానపద, శాస్త్రీయ, సినీ నృత్యాలతో అందరినీ అలరించిన తీరు ప్రేక్షకులకు ఎంతగానో కనువిందు చేసింది.

ముఖ్యంగాతెలుగు బడినుండి మన భాష నేర్చుకొంటున్న చిన్నారులు ప్రదర్శించినతెనాలి రామకృష్ణనాటకం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకొంది.  ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం వలన పిల్లలు మన సంస్కృతికి దగ్గరవడమే కాకుండా చరిత్రాత్మకమైన మన గొప్పదనాన్ని వైభవాన్ని గుర్తించి ముందు తరాలవాళ్ళకు మార్గదర్సకులయ్యే అవకాశం వుంటుంది.

రెండు తరాల ఫాషన్ షో ఆహూతలందరినీ కట్టిపడేసింది.  తెలుగుదనం ఉట్టిపడే ఈ ప్రత్యేక కార్యక్రమంలో చాలామంది పెద్దవారు మరియు ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు పాల్గొని చూపరులను  ఆకట్టుకున్నారు.  తరతరాల మన సంస్కృతిపై ఇక్కడ పెరిగిన పిల్లలు మరియు స్థానిక ప్రముఖులు ఎంతో ఆశక్తితో చూడడం జరిగింది.  

ఈ కార్యక్రమంలో పెద్దవారు జానపద నృత్యానికి మంచి మార్కులే పడ్డాయి.  అతి తక్కువ సమయంలో ఎంతో నేర్పుతో ప్రదర్శించిన ఈ జానపద నృత్యం తెలుగుమల్లి వీడియొ విభాగంలో చూడవచ్చు.

తెలుగు వారి రుచులతో పసందైన విందు భోజనం పండుగ వాతావరణాన్ని పరిపూర్ణం చేసింది

Send a Comment

Your email address will not be published.