జూ. ఎన్టీఆర్ ను పిలవలేదా

నందమూరి తారకరామారావు మనవరాలు మోహన రూపా పెళ్లి హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి ఎన్టీఆర్ కుటుంబమంతా తరలి వెళ్ళింది. అయితే అక్కడ జూనియర్ ఎన్టీఆర్, కజిన్ తారకరత్న మాత్రం కనిపించలేదు.

బాలకృష్ణ, హరికృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, కళ్యాన్ రామ్ సహా మిగిలిన కుటుంబ సభ్యులందరూ మోహనరూప పెళ్ళిలో సందడి చేసిన వారే. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న లేకపోవడం లోటనిపించింది. వీరిద్దర్నీ పెళ్ళికి పిలవనేలేదనే గుసగుసలు వినిపించాయి.

గత ఏడాది బాలకృష్ణ కూతురు పెళ్లి జరిగినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళలేదు.

ఇక ఇప్పుడు మోహన రూప పెళ్ళికి కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. వీరి మధ్య విభేదాలు ఇంకా నెలకొనే ఉన్నాయా అనే మాట వినిపిస్తోంది.

ఇటీవల ఓ సినిమా షూటింగ్ అప్పుడు బాలకృష్ణ గాయపడగా జూనియర్ ఎన్టీఆర్ బాబాయి త్వరగా కోలుకుంటారని ఆయన అభిమానులకు చెప్పడం తెలిసిందేకదా? అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ , తారకరత్న మరో బాబాయి కుమార్తె పెళ్ళికి వెళ్లకపోవడానికి కారణం వీరిద్దరినీ పిలవలేదేమో అని అనుకుంటున్నారు. ఈమధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచినా బాలకృష్ణ తరఫున ఎన్నికల ప్రచారంలోపాల్గొనలేదు. అంతదాకా ఎందుకు, అసలు తెలుగు దేశం పార్టీ ప్రచారానికి దూరంగా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఉండిపోయారని బాలకృష్ణ అభిమానులు ఆయనపై గుర్రుగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి కూడా.

మరోవైపు తారకరత్నను ఈ పెళ్ళికి పిలవకపోవడానికి కారణం ఆయన తమ తల్లిదండ్రుల మాట కాదని అలేఖ్య అనే అమ్మాయిని పెల్లిచేసుకోవడమేనట.

అయితే విచిత్రమేమంటే మోహనరూప పెళ్ళికి జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, ఆయన సోదరుడు కళ్యాన్ రామ్ వెళ్ళడం.

Send a Comment

Your email address will not be published.