జైహో తెలంగాణా

జైహో తెలంగాణా

మెల్బోర్న్ తెలంగాణా ఫోరం అధ్వర్యంలో జైహో తెలంగాణా అమర వీరులకు శ్రద్ధాంజలి సభ మరియు తెలంగాణా రాష్ట్రానికి స్వాగతాంజలి కార్యక్రమాలు జూన్ 1 వ తేదీన అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి షుమారు ౩౦౦ మంది తెలుగు వారు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.
వివిధ తెలంగాణా జానపద గీతాలతో పాటు పలువురి ఉపన్యాసాలతో ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మెల్బోర్న్ లోని స్థానిక తెలంగాణా యువకులు ఎంతో ఉత్సాహంతో పాలుపంచుకోవడం గమనార్హం.
మెల్బోర్న్ తెలంగాణా ఫోరం ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే ముచ్చటగా మూడవ కార్యక్రమం విజయవంతంగా జరుపుకొంది. దీనికి కార్యవర్గ సభ్యులతో పాటు ఎంతోమంది కార్యకర్తలు చాలా కృషి చేసారు. ఇటువంటి కార్యక్రమాలను మున్ముందు కూడా ఎన్నో విజయవంతంగా జరుపుకుంటామని మెల్బోర్న్ లోని తెలుగు వారందరికీ మెల్బోర్న్ తెలంగాణా ఫోరం తెలియజేసింది.
ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా తెలంగాణా ఆవిర్భావ సంబరాలు జరుపుకున్న ఘనత ఒక్క మెల్బోర్న్ తెలంగాణా ఫోరంకే దక్కింది.

Send a Comment

Your email address will not be published.