టర్కీలో చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చద్రబాబు నాయుడు శనివారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్ వెళ్ళారు. ఇస్తాంబుల్ నగరం ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక నగరంగా అభివృద్ధి చెందిందని భావిస్తున్న చంద్రబాబు నాయుడు అక్కడి పర్యాటక అభివృద్ధి పథకాలను పరిశీలించి ఉన్నత అధికారులతో, మంత్రులతో చర్చలు జరుపుతారు. ఆయన అక్కడికి కుటుంబ సమేతంగా వెళ్ళారు. ఆయన ఈ నెల 8 వరకూ అక్కడే ఉంటారు. ఇస్తాంబుల్ నగరం ఒకప్పుడు బాగా వెనుకబడిన నగరమని, ప్రజల సహకారంతో  అతి కొద్ది కాలంలోనే అది ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారిందని చంద్రబాబు హైదరాబాద్ నగరం నుంచి బయలుదేరే ముందు అధికారులతో వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో ఆయన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకట్టుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్ళే ఉద్దేశంలో ఉన్నారు.

Send a Comment

Your email address will not be published.