టాలీవుడ్ లో న్యూ ట్రెండ్

అగ్ర హీరోల సరసన నూతన కథానాయికలు నటించడం పరిపాటే. అయితే నూతన హీరోల సరసన అగ్ర హీరోయిన్లు నటించడం దాదాపుగా జరగదు. ఎంత పెద్ద దర్శకుడైనా ఎంత పెద్ద బ్యానర్ అయినా కొత్త హీరోతో కలిసి నటించడానికి బాగా పేరున్నా హీరోయిన్లు ఒకింత ఆలోచిస్తారు. కానీ దీనిని బ్రేక్ చేస్తూ టాలీవుడ్ రంగంలో ఓ కొత్త ట్రెండ్ కి సమంతా, తమన్నాలు శ్రీకారం చుట్టారు.

ఇటీవల విడుదల అయిన అల్లుడు శ్రీను చిత్రంలో కొత్త హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించడానికి సమంతా ఒప్పుకుని ముందుకు రాగా ఆ చిత్రంలోనే తమన్నా ఒక ఐటెం సాంగ్ లో పాలుపంచుకుంది. దీనితో వీరిద్దరూ టాలీవుడ్ లో ప్రముఖంగా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. పైగా అల్లుడు శ్రీను విజయవంతం కావడంతో మరికొందరు తారలు కూడా కొత్త హీరోతో నటించేందుకు ఆశపడుతున్నారు.

నిజానికి తమిళ, మళయాళ రంగాలలో ఈ ట్రెండ్ చాలా కాలంగానే ఉంది. ఆక్కడ కూడా కొత్త హీరోలతో అగ్రశ్రేణి హీరోయిన్లు నటించడం మామూలే. తెలుగులో కూడా ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలైంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోయే రెండో చిత్రంలో కథా నాయికగా మరో అగ్ర హీరోయిన్ నటించడానికి అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ నటి మరెవరో కాదు, శృతి హాసన్ అని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని అనుకుంటున్నారు.

Send a Comment

Your email address will not be published.