టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా జాతీయ కోర్ కమిటీ

TRS Australia

గౌరవ ఎం పి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారి చేతులమీదుగా ఆస్ట్రేలియా టి ఆర్ ఎస్ శాఖ ‘టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ఫ్రెండ్స్’ ఈ నెల 8న సిడ్నీలో అట్టహాసంగా ప్రారంభించబడినది. ఆస్ట్రేలియా లోని పలు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కవిత గారు అధ్యక్షుడిగా నాగేందర్ రెడ్డి కాసర్ల, ఉపాధ్యక్షులుగా డాక్టర్ అనిల్ రావ్ చీటీ మరియు సోమేశ్ లను నియమించారు. పూర్తి కార్యవర్గాన్ని అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల నియమిస్తున్నట్టు మీడియాకు తెలిపారు.

డాక్టర్ అర్జున్ చల్లగుళ్ళ మరియు సి అమర్ లు జాతీయ కార్యదర్శులుగా,మైనారిటీ సెల్ ఇంచార్జి గా జమాల్ మహమ్మద్, పి ఆర్ ఓ/ ట్రెజరర్ గా సత్యం గురిజపల్లి,సెక్రటరీ గా అభినయ్ కనపర్తి, జాతీయ యూత్ వింగ్ అధ్యక్షుడిగా అమర్ రావ్ చీటీ,జాయింట్ సెక్రటరీలు గా రాజేష్ గిరి రాపోలు మరియు చంద్ర మోరంపూడి,అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా రాకేష్ లక్కారపు మరియు విక్రమ్ కటికనేని. ఈవెంట్స్ ఇంచార్జి గా ప్రకాష్ సూరపనేని,జాతీయ సలహాదారులు గా మాధవ్ రావ్ కటికనేని,సాగర్ రెడ్డి కొమ్మిడి మరియు ప్రవీణ్ రెడ్డి దేశం, కల్చరల్ కో ఆర్డినేటర్ గా అనిల్ బైరెడ్డి,విక్టోరియా స్టేట్ ఇంచార్జి గా సాయిరాం ఉప్పు – కో ఆర్డినేటర్లు గా కళ్యాణ్ ఐరెడ్డి,మధు పర్స,ప్రవీణ్ లేడల్లా మరియు వెంకట్ చెరుకూరి, యూత్ వింగ్ ఇంచార్జి గా సనిల్ రెడ్డి బాసిరెడ్డి, క్వీన్స్ లాండ్ స్టేట్ ఇంచార్జి గా శ్రీకాంత్ రెడ్డి సాదం – కో ఆర్డినేటర్లు గా వినీ,శ్రీ గుజ్జురు మరియు కిరణ్ పర్వతనేని,కాన్ బెర్రా స్టేట్ ఇంచార్జి గా రవి సాయల – కో ఆర్డినేటర్లు గా వీరేందర్,సాంబరాజు మరియు శ్రీధర్ కాల్వ,న్యూసౌత్ వేల్స్ స్టేట్ ఇంచార్జి గా వెంకట్రామ్ – కో ఆర్డినేటర్లు గా వరుణ్ నల్లెల,జస్వంత్ కొడారపు మరియు ప్రకాష్ హనుమంత,మహిళా వింగ్ కు సంగీత గౌడ్ దూపాటి మరియు స్టూడెంట్ వింగ్ కు దినేష్ రెడ్డిఇంచార్జిలుగా,బల్లారట్ ఇంచార్జి గా ఉదయ్ కల్వకుంట్ల,మరియు జీలాంగ్ ఇంచార్జి గా ఆండ్రూస్ జ్ఞానశీలన్ లను ఎన్నుకొన్నట్టు తమ అధికారిక ప్రారంభోత్సవం మన తెలంగాణ అడ పడుచు గౌరవ ఎం పి కవిత గారి చేతులమీదుగా జరగడం ఎంతో ఆనందంగా ఉందని అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మీడియాకు తెలిపారు.

కొత్తగా నియమింపబడిన ఈ పూర్తి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ,ఆస్ట్రేలియాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని,తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకొని తమ వంతు సహాయ సహకారాలను సదా అందిస్తామనీ,తమకీ అవకాశం కల్పించిన కవితక్క గారికి,టి ఆర్ ఎస్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామనీ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మీడియాకు తెలిపారు.

Send a Comment

Your email address will not be published.