ట్యాంక్ బండ్ విగ్రహాలకు ముప్పు?

ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాలన్నీ అనవసరమైనవేనని తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. వీటి గురించి ఎవరికీ తెలియదని కూడా ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఈ విగ్రహాలను తొలగించడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఉన్న ట్యాంక్ బండ్ మీద ప్రస్తుతం వీరేశలింగం పంతులు, సర్ ఆర్థర్ కాటన్, నన్నయ్య, తిక్కన, ఎర్రన, వేమన, అన్నమయ్య, పోతన, వీరబ్రహ్మేంద్ర స్వామి, త్యాగరాజు, శ్రీకృష్ణ దేవరాయలు, అల్లూరి సీతారామ రాజు, బళ్ళారి రాఘవ వంటి వారి విగ్రహాలున్నాయి. తెలంగాణా ఉద్యమం సందర్భంగా గతంలో కొన్ని విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. అప్పటి ప్రభుత్వం వాటిని మరమ్మతు చేయించింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ, చంద్రశేఖర్ రావు తమ ఒక్క రాష్ట్రానికి మాత్రమే ఇది రాజధాని అయినట్టు భావిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాహిత్యవేత్తలు విమర్శిస్తున్నారు. ఒకవేళ ఈ విగ్రహాలను తొలగించాల్సి వస్తే వాటిని భద్రంగా తమకు అప్పగించాలని వారు సూచించారు. ఆ మహామహులు తెలుగు సాహిత్యానికి, వికాసానికి, సంస్కృతికి సంబంధించినవారని వారు వ్యాఖ్యానించారు.

Send a Comment

Your email address will not be published.