ట్వీట్ల బాబు మాట్లాడాడు

ఆయనో ట్వీట్ల బాబు. కేంద్రంలో ఉన్న సోనియా గాంధీ, రాహూల్ గాంధీ, మన్మోహన్ సింగ్ ల దగ్గర నుంచి రాష్ట్ర నాయకులు జగన్ మోహన్ రెడ్డి వరకూ ఎవరి గురించి మాట్లాడాలన్నా అస్సలు నోరు తెరవడు. ఎప్పుడూ చేతులకే పని చెబుతాడు. రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్య మంత్రిగా చేసిన పెద్ద బాబు చంద్రబాబు రాష్ట్రాన్నిహై టెక్ బాట పట్టిస్తే ఆయన తనయుడు చిన బాబు లోకేష్ తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. ఎప్పుడూ కంప్యూటర్ లో ట్వీట్ల ద్వారా జనంతో మాట్లాడటం తప్ప బహిరంగంగా ఇంత వరకూ నోరు తెరిచి ఎరగడు. అందుకే అందరూ ఆయన్ని ముద్దుగా ట్వీట్ల బాబు అని పిలుచుకుంటారు. అలాంటి లోకేష్ బాబు మొదటిసారి గా మాట్లాడాడు. అది కుడా రాబోయే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఎలాంటి వారికి టికెట్లు ఇవ్వబోతుందో ప్రకటించాడు.

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో తెలుగు యువత నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. చంద్ర బాబుతో సమావేశానంతరం వారితో ప్రత్యేకంగా లోకేష్ సమావేశ మయ్యారు. రాబోవు ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తటస్తులకి మాత్రమే టికెట్లు ఇవ్వనుంది. తటస్తంగా ఉన్న సమర్ధులు, నిజాయితీ పరుల్ని గుర్తించాల్సిన బాధ్యత తెలుగు యువత కార్యకర్తల పైన ఉంది.మీరు ఆ బాధ్యతని సమర్దవంతం గా నిర్వహించాలి అని బోధించారు.
2014 ఎన్నికలు తెలుగు దేశానికి ఎంతో కీలకమైనవి. ఆ ఎన్నికల్లో గెలుపు సాధించడం కోసం నాన్న గారితో పాటు నేను, మామయ్యలు హరికృష్ణ, బాలకృష్ణ, బావ మరిది జూనియర్ ఎన్.టి.ఆర్ కూడా కృషి చేస్తాము. మీరు కూడా మీవంతు బాధ్యతని పూర్తి చేయాలని లోకేష్ వారికి సూచించారు.

ఈ సమావేశంలో సీమాంధ్రకి చెందిన ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీ సమైక్య వాదాన్ని అందుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని లోకేష్ కి సూచించగా ఆయన తిరస్కరించారు. నేను తెలంగాణలో పుట్టాను. కోస్తా వారింటికి అల్లుడుని అయ్యాను. మా బంధువులు అంతా రాయలసీమలో ఉన్నారు. అందువల్ల నాకు మూడు ప్రాంతాల ప్రజలూ కావాల్సిందే అని స్పష్టం చేశారు.

Send a Comment

Your email address will not be published.