డల్లాస్ స్థాయిలో హైదరాబాద్?

హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అధికార తెలంగాణా రాష్ట్ర సమితి సర్వ సభ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, నగరంలోని స్కూల్స్, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీ స్థలాలన్నిటినీ కొనుగోలు చేసి అక్కడ పార్కులు, కూరగాయల మార్కెట్లు అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.

ఎక్కడా ఖాళీ స్థలాలను ఉంచే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. తమ హయాంలో తెలంగాణా బంగారు తెలంగాణా కావడం ఖాయమని ఆయన వెల్లడించారు. నగరంలో వెయ్యికి పైగా కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేస్తామని, దోభీ ఘాట్లను నిర్మిస్తామని ఆయన చెప్పారు. నగరంలోని ఎర్రగడ్డ చాతీ, మెంటల్ ఆస్పత్రులను రంగారెడ్డి జిల్లాకు మార్చి, ఈ ఆస్పత్రుల ప్రదేశాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం నిర్మిస్తామని, ప్రస్తుతం సచివాలయం ఉన్న ప్రదేశం వాస్తు రీత్యా బాగు లేదని ఆయన చెప్పారు. కాగా ఎర్రగడ్డలోని చాతీ, మెంటల్ ఆస్పత్రులను అక్కడి నుంచి తరలించాలన్న కె సి ఆర్ నిర్ణయంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Send a Comment

Your email address will not be published.