డాక్టర్ చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు షికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. అమెరికాలోని షికాగో యూనివర్సిటీ నుంచి ఆయనకు ఈ మేరకు సందేశం అందింది. యూనివర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ వాట్సన్ ఆయనకు లేఖ రాశారు. 1867లొ ఏర్పాటయిన ఈ విశ్వవిద్యాలయం ఒక విదేశీ రాజకీయ నాయకుడికి డాక్టరేట్ ప్రకటించడం ఇదే మొదటిసారి. “సామాజిక, ఆర్ధిక సంస్కరణలతో  రైతులు, మహిళల స్వావలంబనకు చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారు. హుదుద్ లాంటి తుఫానును సమర్థంగా ఎదుర్కొన్నారు. 2029 నాటికి దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకటిగా నిలబెట్టడం, 2050 నాటికి ప్రపంచంలోనే అద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దడం అనే లక్ష్యాలతో ఒక ప్రణాళికతో ముందుకు వెడుతున్నారు. ఈ కృషికి గుర్తిమ్పుగానే గౌరవ డాక్టరేట్ ఇస్తున్నాం” అని యూనివర్సిటీ పేర్కొంది.  “గతంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు నాకు డాక్టరేట్ ఇవ్వడానికి ముందుకు వచ్చినా నేను సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాను. అవి అంత అవసరమని నేను భావించలేదు. కానీ షికాగో యూనివర్సిటీ చరిత్ర చూసి, ఈ బిరుదు తీసుకోవడానికి అంగీకరించాను” అని చంద్రబాబు మీడియాతో అన్నారు.

Send a Comment

Your email address will not be published.