తాయి రక్తదాన శిబిరం

Community connect1
దానాలలో అన్న దానం తరువాత రక్త దానం మహా గొప్పదని ఉవాచ. దానం అన్న పదానికి నిర్వచనం మారిపోయిన రోజుల్లో పరదేశంలో నివాసం చేస్తూ పరోపకారార్ధము మరియు లాభాపేక్ష లేకుండా పరమ పావనమైన రక్తదానం చేయడం ఒక పుణ్య కార్యమనే చెప్పాలి. అన్నదానం, విద్యాదానం ఏ దానం చేయాలన్నా ప్రాణమున్న మనిషికే చేస్తాం. అలాంటి ప్రాణాలనే నిలబెట్టే మహత్తర దానం రక్తదానం.

ఈ నెల 12 వ తేదీన మెల్బోర్న్ తెలుగు సంఘం (తాయి) వారి అధ్వర్యంలో మౌంట్ వేవెర్లి లోని రెడ్ క్రాస్ వారి రక్త దాన శిబిరంలో దాదాపు 10 మంది రక్త దానం చేసి తాయి పరంపరను ఈ సంవత్సరం కూడా కొనసాగించారు. వారి వివరాలు:

రఘు బలరామ
విజయ్ సుసర్ల
మురళి ధర్మపురి
గణేష్ దొడ్డి
గుప్త గోలి
వెంకట్ మోటుపల్లి
అను మునుగంటి
లత ఆలుగడ్డ
రావు కొంచాడ

గత మూడు నాలుగు సంవత్సరాలుగా తెలుగు సంఘం సభ్యులు ప్రతీ సంవత్సరం ఇటు తూర్పున వైపున వున్న మౌంట్ వేవెర్లి, పశ్చిమ వైపున వున్న పాయింట్ కుక్ లోనూ రక్తదాన శిబిరాలను నిర్వహించి స్థానికులకు ఎంతో మేలు చేస్తున్నారు.

రక్తం వర్గాలు:
1900 సంవత్సరం లో కారల్ ల్యాండ్ స్టీనర్ అను శాస్త్రవేత్త నాలుగు రక్త వర్గాలను కనుగొన్నారు.
1. ఎ (A)
2. బి (B)
3. ఎబి (AB)
4. ఓ (O)
ఎవరు ఎవరికి రక్తం దానం చేయవచ్చు
ఎబి గ్రూప్ వారు ఎబి గ్రూప్ కి
ఎ గ్రూప్ వారు ఎ, ఎబి గ్రూప్ కి
బి గ్రూప్ వారు బి, ఎబి గ్రూప్ కి
ఓ గ్రూప్ వారు ఎ, బి, ఎబి, ఓ గ్రూప్ ల వారందరికి దానం చేయవచ్చు.

ఎవరు ఎవరి నుండి రక్తం తీసుకోవచ్చు
ఎబి గ్రూప్ వారు అన్ని గ్రూప్ ల నుండి
బి గ్రూప్ వారు బి, ఓ గ్రూప్ ల నుండి
ఎ గ్రూప్ వారు ఎ, ఓ గ్రూప్ లనుండి
ఓ గ్రూప్ వారు ఓ గ్రూప్ నుండి మాత్రమే రక్తం తీసుకోవచ్చు.

Community connect
రక్త దానం వలన కలిగే మేలు
• ఐరన్ నిల్వలను సమతుల్యం చేస్తుంది: శరీరంలో ఇనుము స్థాయిని సమతుల్యం కోసం రక్తం దానం చేయడం చాలా మంచిది. రక్తంలో ఎక్కువగా ఐరన్ ఉంటే గుండెకు హాని చేస్తుంది. కార్డియో వాస్కులర్ వ్యాధులను నివారించేందుకు రక్తదానం చేయడం మంచిది. మహిళల్లో ఒక వయస్సు వచ్చిన తర్వాత రుతస్రావం పూర్తి నిలిచిపోయినప్పుడు వారి శరీరంలో నిల్వఉండే ఐరన్ స్థాయిని సమతుల్యం చేసుకోవాడానికి రక్తదానం చేయడం చాలా ఆరోగ్యకరం.
• హెల్త్ చెకప్: వ్యక్తి రక్తం దానం చేయడానికి అర్హుడా కాడా అన్ని విషయ నిర్ధారణ కోసం డాక్టర్లు కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి రక్తదానం చేయడానికి ముందు డాక్టర్ సలహా ప్రకారం తీసుకోవడం వల్ల వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు.
• క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది: శరీరంలో ఐరన్ నిల్వల స్థాయి తగ్గడం వల్ల క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తుంది. రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్ తో బాధపడుతున్న అవకాశాలు ప్రత్యేకంగా పెద్దపేగు, కాలేయం, గొంతు, మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ లు రాకుండా అడ్డుకుంటుంది.
• అధిక రక్త పోటును నియంత్రిస్తుంది: రక్త దానం చేసినప్పుడు, రక్త పరిమాణం సమతుల్యం చెంది, రక్తపోటును నిరోధిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన గుండె, గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి రక్తదానం చేయడం మంచిది.
• కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: శరీరంలోని రక్త కణాల్లో కొలెస్ట్రాల్ నిల్వ ఉంటుంది. ఎర్ర రక్తకణాల్లో చెడు మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రక్తదానం చాలా ఉపయోగకరం.

కమ్యూనిటీ కనెక్ట్ పేరుతో ప్రతీ సంవత్సరం తాయి నిర్వహించే జనరంజని మరియు రసరాగసుధ కార్యక్రమాల్లో సభ్యుల నుండి విరాళాలను పోగు చేసి స్థానిక సంస్థకు ఇవ్వటం ఆనవాయితీ. ఈ రెండు కార్యక్రమాలకు తాయి జీవిత సభ్యులు శ్రీ ప్రసాద్ పిల్లుట్ల సమన్వయ కర్తగా వ్యవహరిస్తూ తాయి సంస్థకు తనవంతు సహాయం చేస్తుంటారు.

Send a Comment

Your email address will not be published.