తిరుమలకు తెలంగాణ సిఎం

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కె. చంద్రశేఖర్ రావు మొదటిసారిగా తిరుమల వెళ్లారు. ఆయన తిరుమల మీద రెండు రోజులు ఉంటారు. కుటుంబ సభ్యులతోపాటు, పలువురు మంత్రులు, అధికారులు, మొత్తం ముప్పై తొమ్మిది మంది, ఆయన వెంట వెళ్లిన వారిలో ఉన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చడం కోసం ఆయన తిరుమల వెళ్లారు. ఆయనకు తగిన మర్యాదలు కల్పించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను ఆదేశించింది. విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి తదితరులు స్వాగతం చెప్పారు.

ముఖ్యమంత్రి కె.సి.ఆర్ వెంకన్నకు మొక్కుబడి కింద 3.7 కోట్ల రూపాయల విలువైన పద్నాలుగు కిలోల సాలగ్రామ హారం, ఒక కోటి ఇరవై ఒక్క లక్షల విలువైన నాలుగున్నర కిలోల కంఠాభరణం సమర్పించుకున్నారు.

Send a Comment

Your email address will not be published.