తెలంగాణలో జగన్, ఢిల్లీ లో బాబు దీక్షలు

సీమాంధ్ర తగల బడుతున్నా లెక్క చేయ కుండా కేంద్ర క్యాబినెట్ టి. నోట్ ను ఆమోదించింది. కేంద్రం ఈ నిరంకుశ చర్యకు నిరసనగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వై.ఎస్.ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసం లోటస్ పాండ్ వద్ద శనివారం ఉదయం 10.30 నుంచి ఆమరణ నిరాహార దీక్షని ప్రారంభించ నున్నారు.

రాష్ట్ర ప్రజల కోసం ఆమరణ దీక్షకు దిగుతున్నాను. రాష్ట్రాన్ని సమైక్యం గా ఉంచే వరుకూ ఈ దీక్ష సాగుతుంది. రాష్ట్రము విడిపోకూడదని కోరే వారంతా వారి జెండాలతో తన దీక్షకి మద్దతు తెలపాలని కోరారు. చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడిగా మిగలకుండా ఉండాలని భావిస్తే తన దీక్షకి మద్దతు ఇవ్వాలని జగన్ పిలుపు ఇచ్చారు

ఢిల్లీ లో చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ ఫై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలకు నిరసనగా ఈ నెల 7 వ తేదీన ఢిల్లీ లో చంద్ర బాబు నాయుడు దీక్ష చేయనున్నారు.  యు.పి. ఏ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని స్వయంగా వారి ముఖ్యమంత్రి పార్టీ నాయకులూ వ్యతిరేకిస్తున్నారు. ఓట్ల కోసం నీచ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా ఈ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు.

Send a Comment

Your email address will not be published.