తెలంగాణలో పుట్టి ... పూల పల్లకి ఎక్కి

IMG_0143
…లోకమంతా తిరిగిన బతుకమ్మ
ఈ తెలంగాణా మట్టికి తోబుట్టువు నీవమ్మ

భావోద్రేకమైన ఈ చరణం మనసులోని ఉద్రేకాన్ని రేకిస్తుంది. పండగ వాతావరణాన్ని గుర్తుకు తెస్తుంది. తెలిగింటి ఆడపడుచు మనసు పులకరిస్తుంది. తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలుస్తుంది.

చిన్నప్పుడు మనం తిరిగిన గుమ్మం, కూర్చున్న అరుగు, దూరంగా కనిపించే కొండలు, పచ్చని చేను పొలాలు, చెరువు నిండా నీరు, కాలికి అంటుకున్న బురద, తాత భుజాన నాగలి, చేతిలో జోడెద్దులు తోలే ములుగు కర్ర, బుట్ట నిండా పూలు, ఇంట్లో అరిసెలు, సకినాలు – ఇలా వ్రాసుకుంటూ పొతే ఒక జీవిత కాలం సరిపోదు. గత స్మృతులు గుర్తుకు తెచ్చే మన పండగ ఒక సజీవ నది లాంటిది. ఏడాదికొకసారి వచ్చినా మళ్ళీ ఏడాది వరకూ ఆ మధుర స్మృతులను మననం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. మన పండుగల్లో ముఖ్యంగా తెలంగాణా సోదర సోదరీమణులు జరుపుకునే బతుకమ్మ పండగ చరిత్ర పరంగా ప్రాముఖ్యతను సంతరించుకోవడమే కాకుండా శాస్త్రీయపరంగా ఎంతో పరిణితి చెందిన పండగ.

దసరా, దీపావళి పండగల కాలంలోనే ఈ పండగ రావడం మరింత గొప్పదనాన్ని సంతరించుకుంది.

13DAF59A-0050-4AAD-91D9-7AF6184DE97D
038A4D47-54B5-4EC6-A9FF-7A668EF243E5
మెల్బోర్న్ నగరంలో మెల్బోర్న్ తెలంగాణా ఫోరం అధ్వర్యంలో వరుసగా ఐదవ సంవత్సరం జరిగిన బతుకమ్మ పండగకు షుమారు 2,500 మంది వచ్చినట్లు అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ తోపుచర్ల గారు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో బతుకమ్మ పాటలతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

మెల్బోర్న్ తెలంగాణా ఫోరం ఐదేళ్ళ సందర్భంగా శ్రీ రాకేశ్ లడ్డు వ్రాసి పాడిన బతుకమ్మ పాటను ఆవిష్కరించడం కూడా జరిగింది.

CD95EFA1-32DB-47E1-B202-C859332ADBDF
ఈ కార్యక్రమానికి అనేకమంది స్థానిక ప్రముఖులు వచ్చారు. వారు:
Tim Watts – Federal Parliament Member
Cr.Catherine Cummings – Mayor Marybyrnong city council
Cr.Sarah Carte – Deputy Mayor Marybyrnong city council
Cr.Cuc Lam – Councilor
Cr.Mia McGregor – Councilor
Ms.Elizabeth Drozd

ప్రత్యేక అతిధిగా గాయకురాలు మాటకారి మంగలి గారు వచ్చి తన అద్భుతమైన గానంతో శ్రోతలను మంత్ర ముగ్దులను చేసారు.

శ్రీ ప్రవీణ్ తోపుచర్ల బతుకమ్మ పండగ మెల్బోర్న్ నగర నడిబొడ్డున ఫెడరేషన్ స్క్వేర్ లో నిర్వహించి బహుళ సంస్కృతీ సాంప్రదాయాలకు నిలయమైన ఆస్ట్రేలియా దేశంలో భారతీయ సంఘాలే కాకుండా స్థానిక సంస్థలతో మమేకమై నూతన శోభను చేకూర్చడానికి ప్రయత్నిస్తామని ఆకాంక్షించారు.

ఈ సంవత్సరం సామజిక దృక్పధంతో Dr.Yoland Antill, Oncologist (Womens Cancer Foundation Australia) గారిని ఆహ్వానించి స్త్రీల ఆరోగ్య సంక్షేమానికి సంబందించిన విషయాలపై కూలంకుషంగా మాట్లాడారు.

తెలుగు వంటకాలు సకినాలు, గవ్వలు, అరిసెలు, చేగోడీలు, బూంది మొదలైనవి వచ్చిన అతిదులందరికీ ఇవ్వడం జరిగింది.
A59CD70E-611E-41F5-9698-4C0940784687

Send a Comment

Your email address will not be published.