తెలంగాణాలో ఎక్స్ ప్రెస్ హైవేలు

తెలంగాణా రాష్ట్రంలో 45 వేల కోట్ల రూపాయల వ్యయంతో 1800 కిలోమీటర్ల జాతీయ రహదార్లు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందులో హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు మధ్య రెండు అతి విశాలమయిన నాలుగు రోడ్ల జాతీయ రహదారిని నిర్మించడం జరుగుతుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఆయన వరంగల్, యాదగిరి గుట్టలకు మధ్య ఒక ఎక్స్ ప్రెస్ హైవేకి శంకుస్థాపన చేస్తూ ఈ ప్రకటన చేశారు. వరంగల్, భద్రాచలం లకు మధ్య జాతీయ రహదారిని నిర్మించడానికి కూడా ఆయన అనుమతి మంజూరు చేశారు. అంతేకాక, 12 రాష్ట్ర రహదారులని జాతీయ రహదార్లుగా మార్చనున్నామని, దీనివల్ల రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగం పుంజుకొంటుందని ఆయన తెలిపారు. అవసరమైతే మరికొన్ని రోడ్లను కూడా విస్తరిస్తామని, ఈ విషయంలో ఏవైనా ప్రతిపాదనలుంటే ప్రభుత్వం వెంటనే తమకు పంపించాలని ఆయన సూచించారు.

Send a Comment

Your email address will not be published.