తెలంగాణాలో రిలయన్స్ యూనివర్సిటీ

వ్యాపార దిగ్గజం రిలయెన్స్ సంస్థ క్రమంగా విద్యా రంగంలోకి కూడా ప్రవేశిస్తోంది. తెలంగాణా రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో ఉంది. అంతేకాదు, మరికొన్ని వ్యాపార దిగ్గజాలు కూడా ప్రైవేటు రంగంలో విశ్వవిద్యాలయాలను ప్రారంభించడానికి ముందుకు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో విశ్వవిద్యాలయాలు ప్రారంభం కాబోతున్నట్టు ఇటీవల తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రిలయన్స్ ప్రతినిధి బృందం ఒకటి కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రిని కలిసి ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించి, గ్రీన్ సిగ్నల్ పొందినట్టు తెలిసింది. రిలయన్స్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం వచ్చే శీతాకాల సమావేశాల్లో శాసనసభలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును ప్రవేశ పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ బిల్లుకు ఆమోద ముద్రవేసి, వచ్చే ఏడాది నుంచే ఇటువంటి విశ్వవిద్యాలయాలను ప్రారంభించడానికి కూడా ప్రణాలికలు రూపొందిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత కనీసం 15 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో ప్రారంభం కావడానికి అవకాశం ఉందని తెలిసింది.

Send a Comment

Your email address will not be published.