తెలంగాణాలో వరాల పంట

తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిన్న ఒక్క రోజే 43 నిర్ణయాలు తీసుకుని దేశంలో చరిత్ర సృష్టించారు. నిన్న హైదరాబాద్ నగరంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆయన అనేక అభివృద్ధి, సంక్షేమ, జనాకర్షక కార్యక్రమాలు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉద్యోగులకు వేతనాలు, తెలంగాణా ఇంక్రిమెంట్ పేరుతో ప్రత్యేక ఇంక్రిమెంట్, కటాఫ్ తేదీ లేకుండా బంగారం రుణాలతో సహా రుణాలన్నీ మాఫీ, దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి, గిరిజన, దళిత యువతులకు కళ్యాణ లక్ష్మి పథకం పేరుతో పెళ్లి సమయంలో 50 వేల రూపాయల నజరానా, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లపై కమిటీ, వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయల పించన్, కాంట్రాక్టు ఉదోగుల క్రమబద్ధీకరణ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ క్యాబినెట్ సమావేశం సుమారు అయిదు గంటల పాటు సాగింది.

Send a Comment

Your email address will not be published.