తెలంగాణా ఆర్ధికమంత్రి మెల్బోర్న్ పర్యటన

తెలంగాణా మొదటి అర్దికమంత్రిగా చరిత్ర పుటలకెక్కిన శ్రీ ఈటెల రాజేందర్ గారు మెల్బోర్న్ నగరాన్ని సందర్శించిన సందర్భంగా మెల్బోర్న్ తెలంగాణా ఫోరం ఘనంగా సత్కరించింది. ఈ నెల 4 వ తేదీన అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో సాయం సమయమున జరిగిన సభకు షుమారు 300 మంది MTF సభ్యలు కుటుంబ సమేతంగా రావడం విశేషం.

MTF అధ్యక్షులు శ్రీ రాజేష్ రెడ్డి మరియు ఉపాధ్యక్షులు శ్రీమతి నందిని బిస్కుండ గార్లు శ్రీ రాజేందర్ గారిని గౌరవ మర్యాదలతో సంప్రదాయబద్దంగా సత్కరించిన తదుపరి శ్రీ రాజేందర్ గారు తెలంగాణా రాష్ట్రవిర్భావంలోని ముఖ్య ఘట్టాలను, ఉద్యమంలోని కొన్ని విశేషాలను, గత సంవత్సరంలో వారు చేపట్టిన కార్యక్రమాలు, రాష్ట్రాభివృద్ధిలో కీలక నిర్ణయాల గురించి వివరించారు. ప్రవాస భారతీయులు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి పుర ప్రముఖులు ఇతర తెలుగు సంఘాల అధ్యక్షులు – ముఖ్యంగా గోపాల్ తంగిరాల (మెల్బోర్న్ తెలుగు సంఘం అధ్యక్షులు) శ్రీ ఆదిరెడ్డి యారా (సౌత్ ఆస్ట్రేలియా తెలుగు సంఘం అధ్యక్షులు) శ్రీ రాంపాల్ ముత్యాల (ఓం సాయి కార్యదర్శి) మరియు శ్రీమతి హరి రమాదేవి (తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు) హాజరయ్యారు. తెలంగాణా ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర రెడ్డి నూకల గారు ఈ కార్యక్రమ నిర్వహణలో క్రియాశీలక పాత్ర వహించారు.

ఈ సందర్భంగా శ్రీ ఈటెల రాజేందర్ గారు MTF నిర్వహించనున్న బతుకమ్మ పండగ వీడియో మరియు పోస్టర్ ను విడుదల చేసారు.

శ్రీ రాజేందర్ గారి గురించి…

తెలంగాణా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి మొట్టమొదటి ఆర్ధిక మంత్రిగా గుర్తింపు పొంది రాజకీయ సవ్యసాచిగా పేరు పొందారు. తెలంగాణా రాష్ట్ర సమితిలో 2004లో మొట్టమొదటి సారిగా పార్టీ తరఫున రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. సంయుక్త రాష్ట్రంలో శాసనసభా పక్ష నేతగా పనిచేసి పరిపాలనా రంగంలో ఆరితేరారు. 2002లో గజ్వేల్ లో తన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గరనుండి ఇప్పటికి మూడు సార్లు శాసనసభకు ఎన్నికై రాజకీయ పరిపాలనా రంగాల్లో పార్టీ నాయకత్వానికి వెన్నెముకగా నిలిచారు.

చిన్నప్పుడే PDSU లో ప్రముఖ పాత్ర వహించి వామపక్ష పార్టీలతో కొంత కాలం పనిచేసి తెలంగాణా రాష్ట్ర అవశ్యకతను గుర్తెరిగి క్రియాశీలక రాజకీయాల్లో ఉద్యమం ద్వారా రాష్ట్రాన్ని సాధించాలన్న ఆకాంక్షతో తెలంగాణా రాష్ట్ర సమితిలో 2004లో మొట్టమొదటి సారిగా పార్టీ తరఫున రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. సంయుక్త రాష్ట్రంలో శాసనసభా పక్ష నేతగా పనిచేసి పరిపాలనా రంగంలో ఆరితేరారు. 2002 లో తన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గరనుండి ఇప్పటికి మూడు సార్లు శాసనసభకు ఎన్నికై రాజకీయ పరిపాలనా రంగాల్లో పార్టీ నాయకత్వానికి వెన్నెముకగా నిలిచారు.

సమాజసేవలో సహచరిణిగా వున్న శ్రీమతి జమునా రెడ్డి గారిని సహధర్మచారిణిగా చేసుకుని వారిరువురికున్న వామపక్ష భావాలకు వన్నె తెచ్చారు.

నిజయతీకి మారుపేరుగా నిలబడి ప్రజా ఉద్యమంలో భాగంగా పదవిని వదలుకొని నాయకత్వ స్పూర్తినిచ్చిని ప్రజా నాయకులు శ్రీ ఈటెల రాజేందర్.

ఉద్యమమే ఊపిరిగా వారసత్వమే ఆయుధంగా ప్రజాసేవే పరమావధిగా తెలంగాణా రాష్ట్రమే ఆశయంగా ప్రజల మనసుల్లో కలకాలం బంధాన్ని ఏర్పరచుకున్న విజ్ఞులు శ్రీ రాజేందర్ గారు అనడంలో అతిశయోక్తి లేదు.

Send a Comment

Your email address will not be published.