తెలంగాణా వంటకాలకు మహర్దశ

sakinaluతెలంగాణా ప్రభుత్వం తమ ప్రాంతంలోని వంటకాలకు రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాలలో పరిచయం చేసి వాటి గురించి ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించింది. తెలంగాణా వంటలు అనగానే సకినాలు, సర్వపిండి, పచ్చిపులుసు, ముద్దగారెలు, జొన్న రొట్టెలు,వరుగులు, నువ్వుల సద్ది ఇలా ఎన్నో రకాల వంటలు గురుహుకు రాకమానవు. తెలంగాణా సంస్కృతితో ఈ వంటకాలు ముడిపడి ఉన్నాయి. అయితే ఈ వంటకాల రుచులు నలుగురికీ తెలిసేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలతో రాష్ట్ర సాంస్కృతిక శాఖ తెలంగాణా వంటకాలకు సంబంధించి ఓ కొత్త విధానాన్ని రూపొందించింది. ఈ విధానాన్ని కె సీఆర్ త్వరలోనే ఆవిష్కరిస్తారు.

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణా వంటకాల ఘుమఘుమలు పెద్దగా ప్రాచుర్యంపొందలేదన్న కారణంగా తెలంగాణా ప్రాంతంప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడంతో ఇప్పటికైనా తమ వంటకాలనువిశ్వవ్యాప్తం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంది.

తెలంగాణా వంటకాల తయారీకిసంబంధించి ప్రముఖులతో చర్చించిన తర్వాతే ఈ కొత్త రుచుల విధానానికి ఒక రూపం ఇచ్చారు.

అయితే ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ఓ ఉఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కమిటీలో నిపుణులు ఉంటారు.

ఇప్పటికే రెండువందల యాభైకి పైగా వంటకాలు గుర్తించిన ప్రభుత్వం వాటికి పేటెంట్ తీసుకోబోతోంది.

తెలంగాణా ప్రాంతాలలోనే కాకుండా ప్రతి హోటల్, రెస్టారెంట్లలో దాబాల్లో ఈవంటకాలు అందుబాటులో ఉండేలా చూస్తారు. అంతేకాదు, తెలంగాణా ప్రాంతంలో పూర్వ కాలం నుంచి ఉన్న వంటకాలను గుర్తించి వాటికికూడా ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నది కె సీఆర్ ప్రభుత్వ తహతహ. అలాగే ప్రత్యేకించి ఓ పరిశోధనా సంస్థ ఏర్పాటుచేసి తెలంగాణా వంటకాలు, పోషకాహారం గురించి ఈ సంస్థ అధ్యయనంచేస్తుందికూడా.

ఇలా ఉండగా, తెలంగాణా వంటకాలకు ప్రత్యేకించి సొంతంగా హోటళ్లు పెట్టుకుంటే వారికి రుణ సదుపాయం కూడా ఇస్తుంది ప్రభుత్వం. అయితే వాళ్ళు సంబంధిత కోర్సులలో శిక్షణ పొంది ఉండాలి. తెలంగాణా వంటకాలను రాష్ట్రంలో విక్రయించే హోటళ్లకు సంవత్సరానికి మూడు లక్షల రూపాయల చొప్పున, దేశంలోని ఇతర ప్రాంతాల హోటల్లో తెలంగాణ వంటకాలు విక్రయించే వారికి పదిలక్షల రూపాయల వరకురాయితీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కాగా తెలంగాణా వంటకాలపై పోటీలు పెట్టి బహుమతులు ఇవ్వాలన్నది కూడా ప్రభుత్వ నిర్ణయం.

Send a Comment

Your email address will not be published.