తెలంగాణ ఫోరం - ఉగాది ఉత్సవం

తెలంగాణ ఫోరం - ఉగాది ఉత్సవం

మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ఈ నెల 19 వ తేదీన ఉగాది ఉత్సవాన్ని సాంప్రదాయ బద్ధంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు.  ఈ ఉత్సవంలో ముఖ్యంగా ఎంతో మంది యుక్త వయస్సులో వున్న తలిదండ్రులు తమ పిల్లలతో పాల్గొనడం విశేషం.  షుమారు 3 గంటల పాటు జరిగిన ఈ ఉత్సవానికి 250 మంది హాజరైనారు.

ముందుగా తెలుగువారి సాంప్రదాయానికి అనుగుణంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి శ్రీ మూర్తి గారిచే పంచాంగ శ్రవణం చేయడం పలువురిని ఆకట్టుకుంది.  ఈ సంవత్సరం 27 నక్షత్రాల ఫలితాలతో పాటు 12 రాసుల ఆదాయ వ్యయాలు మరియు రాజపూజ్యావమానాలు తెలపడమే కాకుండా ఈ జయ నామ సంవత్సరం సాధారణ ఫలితాలు ఎలా ఉంటాయని తెలిపారు.

ఉగాది అనగానే మొట్టమొదటగా “కవి సమ్మేళనం” గుర్తుకి వస్తుంది.  ఈ కవి సమ్మేళనం శ్రీ మురళి ధర్మపురి గారు నిర్వహించి తమ హాస్య రస శాయిరీలతో అందరినీ ఆకట్టుకున్నారు.  ఇందులో శ్రీమతి శోభ రాణి, శ్రీ అశోక్, శ్రీ వడ్దేరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఉగాది ఉత్సవానికి వన్నె తెచ్చారు.

ఈ ఉత్సవంలో భాగంగా మధ్య మధ్యలో తమాషాగా ప్రేక్షకులను ప్రశ్నలడిగి బహుమతులతో ఆశ్చర్యంలో ముంచెత్తారు.

“రచనా నాట్యాలయ” వారి సౌజన్యంతో నృత్య కార్యక్రమాలు నిర్వహించి చాలామంది పిల్లలను పాల్గొనేలా చేయడం అలాగే ఎంతో మంది కార్య వర్గ సభ్యులు కార్య కర్తలు తమవంతుగా ఈ కార్యక్రమానికి చేయూతనివ్వడం ఆనందకర విషయమని అధ్యక్షులు శ్రీ నూకల వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు.  భావి కార్యక్రమాలను వివరిస్తూ వచ్చే సెప్టెంబర్ నెలలో పెద్ద ఎత్తున బతకమ్మ పండగ రెండవ తడవ నిర్వహ్స్తున్నట్లు చెప్పారు.  జూన్ నెలలో అమర వీరుల నివాళి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాబోతున్నట్లు తెలిపారు.

శ్రీ రమేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వాచాస్పతులుగా బాధ్యతలు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి మీడియా పార్టనర్ గా తెలుగుమల్లి మరియు షేరిడియన్ హోమ్స్ స్పోన్సర్ గా సహాయాన్నందించారు.

Send a Comment

Your email address will not be published.