తెలుగు బడి - అక్షర జ్యోతి

18-08-2013 – మెల్బోర్న్ తెలుగు సంఘం వారి తెలుగు బడి అక్షర జ్యోతి హాపర్స్ క్రాసింగ్ లో తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ పవన్ మటంపల్లి ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి వింధమ్ సిటీ కౌన్సిల్ మేయర్ Cr Heather Marcus గారు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ గారు మాట్లాడుతూ తెలుగు భాష భారత దేశంలో మాట్లాడే భాషల్లో మూడవదని,  ఈ లిపి ప్రపంచంలోని భాషల్లో అత్యంత సుందరమైన రెండవ లిపిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిందని తెలిపారు.  తెలుగు భాష “ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్” గ వర్ణింప బడిందని సంస్కృత భాషకు అత్యంత చేరువైన భాషనీ తెలియజేసారు.  ఈ హపర్స్ క్రాసింగ్ విభాగానికి నిర్వహణ అధ్యాపకుల బృందాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా Cr Heather Marcus మాట్లాడుతూ వింధమ్ సిటీ కౌన్సిల్ బహుళ సంస్కృతులకు నిలయంగా అభివర్ణిస్తూ తెలుగు వారు ఈ ప్రాంతానికి వెన్నుముకలాంటి వారని ఈ భాషా సంస్కృతులు అభివృద్ధి చెందడానికి అన్ని వనరులనూ అందించగలమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తెలుగుమల్లి వారి పెద్ద బాల శిక్ష ప్రతిని ప్రతీ విద్యార్ధికి అందజేయడం జరిగింది.  అంతే కాకుండా పెద్ద బాల శిక్ష ప్రతిని వింధమ్ సిటీ కౌన్సిల్ గ్రంధాలయంలో తెలుగువారందరికీ అందుబాటులో ఉండడానికి ఏర్పాట్లు చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు.

తెలుగు సంఘం కార్యవర్గం తో పాటు షుమారు 40 మంది విద్యార్ధులు వారి తలిదండ్రులు మరియు భాషాభిమానులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రారంభోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించారు.

1 Comment

  1. Namasthe…Pavan Babu and Mallikeshwar Rao Gaaru, Great and Wonder full job have been done for Telugu Families, Good start to our Telugu families and Telugu learning kids in the west side of Melbourne City. Definitely one day this Telugu School will be proven, How our Telugu kids growup in High level of Telugu Speaking, Reading and Talking skills. God (Saibaba) blessings with this Great opportunity to learn the Telugu Language in Australia…..Venkat Nookala ,President and Team Members of, Melbourne Telangana Forum…. Jai Telangana.

Send a Comment

Your email address will not be published.