తెలుగు రాష్ట్ర సమితి

తెలంగాణాలో అధికారంలో ఉన్న తెలంగాణా రాష్ట్ర సమితి త్వరలో తెలుగు రాష్ట్ర సమితిగా పేరు మార్చుకోనుందా? ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమారుడు, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి కె. తారక రామారావు మాటలను బట్టి ఇలా జరిగే అవకాసం ఉందనే అనిపిస్తోంది. ఆయన ఇక్కడ ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ, పార్టీ పేరును మార్చాలను కుంటున్నట్టు చెప్పారు. తాము త్వరలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా అడుగు పెట్టాలను కుంటున్నట్టు ఆయన తెలిపారు.

ఇటీవల ముఖ్యమంత్రి అమరావతి వెళ్ళినప్పుడు అపూర్వమయిన స్పందన లభించిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణా ప్రాంత నాయకులకు ఆంధ్రలో ఆదరణ బాగా ఉన్నట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు. అవసరమయితే తాను భీమవరం నుంచి పోటీ చేయగలనని రామారావు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.