త్వరలో ఓయూ ఉత్సవాలు

OU-centenaryఅతి త్వరలో ఉస్మానియా విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించింది. ఏడవ నిజాం కాలంలో ప్రారంభమయిన ఈ విశ్వ విద్యాలయం ఈ ఏడాదితో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఆగష్టు నెల లోపల ఈ ఉత్సవాలు నిర్వహించడానికి కె.సి. ఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ఆయన ప్రభుత్వం ఈ ఉత్సవాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వాన్ని 436 కోట్ల రూపాయలు అభ్యర్థించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది. అయితే కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతో, ప్రస్తుతానికి 200 కోట్ల రూపాయలను రాష్ట్రమే విడుదల చేసి పనులు మొదలుపెట్టింది. మరో పది కోట్ల రూపాయలను యూజీసీ ఇస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ యూనివర్సిటీ విద్యార్థులను ఈ ఉత్సవాలకు ఆహ్వానించాలని, వివిధ దేశాల అధిపతులను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఉత్సవాల సందర్బంగా అంతర్జాతీయ స్థాయి సదస్సులు, సమావేశాలు, చర్చలు నిర్వహిస్తారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ ఉత్సవాల నిర్వహణకు ముగ్గురు మంత్రులు, పలువురు అధికారులు, విద్యా రంగ నిపుణులతో ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. కేంద్రం నుంచి నిధులు వచ్చేదీ రానిదీ తేలిపోయిన తరువాత ఉత్సవాల తేదీని ఖరారు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

Send a Comment

Your email address will not be published.