త్వరలో కొత్త రాజధాని?

ఇక 45 రోజుల్లో సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధానిని ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నందువల్ల సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించడానికి కేంద్ర చర్యలు తీసుకుంటోంది. కేంద్రం నిన్న లోక్ సభలో ప్రవేశ పెట్టిన బిల్లులోని వివరాల ప్రకారం, త్వరగా రాజధానిని ఎంపిక చేయడంతో పాటు, ఆ ప్రాంత అభివృద్ధికి భారీగా పన్ను మినహాయింపులు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ రెండు ప్రాంతాలకు పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని, కృష్ణ-గోదావరి నదీ జలాల బోర్డును పర్యవేక్షించడానికి ప్రత్యేక మండలిని ఏర్పాటు చేస్తామని, కొత్త రాజధానిలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని కేంద్రం ఆ బిల్లులో  తెలిపింది. ఉభయ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి కోసం చర్యలు తీసుకుంటామని, ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలతో ఒకే గవర్నర్ ఉంటారని కూడా బిల్లు తెలిపింది.

Send a Comment

Your email address will not be published.