దక్షిణాదిపై బీజేపీ కన్ను

కేంద్రంలో సరయిన మెజారిటీతో అధికారానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఈ అయిదేళ్ళ కాలంలో తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో సహా దక్షిణ భారత దేశంలో పూర్తి స్థాయిలో విస్తరించడానికి చర్యలు తీసుకుంటోంది. తమ కార్యకర్తల శ్రేణి అయిన ఆర్.ఎస్.ఎస్, విద్యార్థి పరిషత్, విశ్వ హిందూ పరిషత్ తదితర అనుబంధ సంస్థల్ని పటిష్టం చేయబోతోంది. దాని మిత్ర పక్షమయిన తెలుగుదేశం పార్టీ ఇందుకు అంతగా సుముఖంగా లేనప్పటికీ, బీజేపీ మాత్రం ఈ విషయంలో గట్టి నిర్ణయంతో ఉంది. ఈ రాష్ట్రాలలో బలపడడానికి ఈ రెండు మిత్రపక్షాలు పోటీ పడడం విశేషం. ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ బాగా క్షీణించింది. పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులుగా ఉన్న నేపథ్యంలో వారిని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఈ రాష్ట్రాలలో బలపదవచ్చని బీజేపీ భావిస్తోంది. అయితే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న స్థానాలలో కాంగ్రెస్ వారిని చేర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తే, దాని ప్రభావం తెలుగుదేశంతో దానికున్న మైత్రీ బంధంపై పడే అవకాశం ఉంది.

Send a Comment

Your email address will not be published.