దర్శకుడు వీ వీ వినాయక్

మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమాపై రకరకాల వార్తలు వచ్చినా, వస్తున్నా ఈ తాజా వార్త వీ వీ వినాయక్ కు ఓ శుభావార్తగానే చెప్పుకోవలసి ఉంటుంది. ఎందుకంటే చిరు సినీ జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉండాలనుకుంటున్న ఆయన కుమారుడు రామ్ చరణ్ నిర్మించ తలపెట్టిన ఆ 150వ చిత్రానికి వీ వీ వినాయక్ దర్శకత్వం వహించే అదృష్టం కలుగుతోంది.

ఈ చిత్రానికి స్క్రిప్ట్ ఏమై ఉంటుంది? దర్శకులు ఎవరు? అనే విషయమై రకరకాల ఊహాగానాలు షికార్లు చేసాయి. అయితే ఇప్పుడు వీ వీ వినాయక్ ఆ చిత్రానికి దర్శకత్వం చేపట్టే అవకాశం వచ్చినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ఆయన బిజీగానే ఉన్నారు.

ఆగస్ట్ నెల 24వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు. ఆ రోజే ఈ 150వ సినిమా లాంచనంగా ప్రారంభం కావచ్చని తెలిసింది. ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తారు… కథ ఏమిటి తదితర వివరాలన్నీ త్వరలో వెల్లడిస్తానని వీ వీ వినాయక్ చెప్పారు. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించడమే కాకుండా సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషించబోతున్నారు.

Send a Comment

Your email address will not be published.