దశరాత్రం - దసరా

దసరా అనగా దశ (పది) రాత్రుల పండుగ.”దశరాత్రం” దశరా అయి తర్వాత ప్రజలవాడుకలో “దసరా” అయింది. ఇది శరత్కాలంలో వస్తుంది. ఈ కాలంలో నదీజలాలు నిర్మలంగా ఉంటాయి. ఈ కాలంలోనే అగస్త్యుడనే ఋషి నక్షత్రరూపంలో దక్షిణదిక్కున కన్పిస్తాడు.

సప్తర్షిమండలం ఉత్తరాన రాత్రిపూట మనకు కన్పిస్తుంది. సప్తర్షులలో అగస్త్యుడుంటాడు. అతణ్ణి మనం ఈ కాలంలో దక్షిణాన చూస్తాం. ఇక్కడ చరిత్రకూడా ఉంది. పూర్వం వింధ్యపర్వతం పైకి పెరిగిపోతూంటే సూర్యునిగమనానికి అడ్డు వచ్చింది.అప్పుడు దేవతలు అగస్త్యమహర్షిని వేడుకొంటే అతడు ఉత్తరంనుండి దక్షిణానికి వచ్చాడుట. త్రోవలో మహర్షి వస్తున్నాడుగదా అని తల వంచి నమస్కరించిందట. అలా పర్వతం తల వంచగానే మహర్షి ఆశీర్వదించి తాను తిరిగి వచ్చేవరకూ అలాగే ఉండమని చెప్పాడుట. అప్పటినుండి వింధ్యపర్వతం ఎదగడం మానేసిందిట. ఈ కథ భారతదేశానికి సంబందించినదే. భారతదేశంలోనే కదా వింధ్యపర్వతాలున్నాయి.ఈ చరిత్ర మనకు ఈ కాలంలో ఆకాశంలో కూడా కన్పిస్తుంది.

చూడండీపద్యం—–“మత్తేభవృత్తంలో”

శమనాశాంచల వీథి గుంభజుడు న
క్షత్రాకృతిం దోచె, భా
సముపేతుండయి, వాహినీ జలము వై
శద్యంబు ప్రాపించె, నిం
కమితేర్ష్యామయ వైరి వింధ్యమద సం
రంబు కావించి, దే
శము నందున్ స్థిరశాంతి వైభవ వికా
సంబుల్ ప్రతిష్ఠించుతన్.

(శమనుడు అనగా యముడు. అతని “ఆశ” అనగా దిక్కు.=దక్షిణదిక్కు;అమిత=అధిక;ఈర్ష్య=అసూయ; భా=కాంతి;వాహిని=నది.వైరి=శత్రువు.=వింధ్యపర్వతం)కుంభజుడు=అగస్త్యుడు(కుండలో పుట్టాడు)దీనికి
కూడా చరిత్ర ఉంది.ఇలామన చరిత్ర ఆకాశంలో ఉంది.అంతేగాక శరత్కాలలక్షణంకూడా ఇందులో ఉంది)

ఇరిగివరపు నరసింహాచారి (ఐవియన్)

Send a Comment

Your email address will not be published.