నట యోగి..సి ఎస్ ఆర్

సి ఎస్ ఆర్ ఓ మరపురాని నటులు. ఆయన పూర్తి పేరు చిలకపూడి సీతారామాంజనేయులు. ఆయన పోషించిన పాత్రలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ గుర్తు ఉండిపోయేవి. ఆయనలోని ముఖ్యమైన అంశం ఏమిటంటే వాచికం. అంటే డైలాగ్ మాడ్యులేషన్.

సి ఎస్ ఆర్ కు నాటకరంగం పుట్టిల్లు. సినిరంగం మెట్టిల్లు. ఆయన నాటకాలతోనే సినిమాలోకి వచ్చారు. ఆయన వేసిన మొదటి నాటకం రాధాకృష్ణ. అందులో ఆయన వేసిన పాత్ర శ్రీకృష్ణుడు.

ఆయన నాటకాల్లో పద్యాలు రాగయుక్తంగా చెప్పుకుపోతుంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టి తమ సంతోషం వ్యక్తం చేసేవారు.

సి ఎస్ ఆర్ శ్రీ లలిత కళా దర్శ మండలి అనే నాటక సంస్థ ఏర్పాటు చేసి అది వేదికగా చేసుకుని ఆయన తుకారాం నాటకాన్ని అనేకసార్లు ప్రదర్శించారు. అందులో ఆయన వేసిన పాత్ర తుకారాం. తుకారాం నాటకమంటే ఆయనకు ఎంతో ఇష్టం.

ఆయన తుది శ్వాస విడిచినప్పుడు అందరూ “తుకారం” అనే పెలిచారు.

ఇక సినీ జీవితానికి వస్తే ,1935 లో ఆయన నటించి విడుదల అయిన వేంకటేశ్వర మహత్యం ఆయన నట జీవితంలో ఒక మైలురాయి.

మాయా బజారులో ఆయన వేసిన శకుని పాత్ర ఎవరూ మరచిపోలేరు. కన్యాశుల్కం, రోజులు మారాయి, దేవదాసు తదితర చిత్రాల్లో నటించిన ప్రతి పాత్రలోనూ ఆయన తన మహా నటనతో జీవించారు అనే చెప్పుకోవాలి.

ఆయన దాదాపు మూడు దశాబ్దాలు సినీ జీవితంలో సాగారు.

ఆయన నటించిన చివరి చిత్రం ఇరుగు – పొరుగు. అది

ఆయన పాట కూడా పాడారు. గృహప్రవేశం చిత్రంలో ఆయన పాడిన తులశమ్మక్కా – పాట పాడారు. ఈ పాటను స్వరపరచినది బాలాంత్రపు రజనీకాంత రావు. ఆ సినిమాలో ఆయన అక్కగా హేమలత, ఆమె సవతి కూతురుగా భానుమతి నటించారు.

విషాదం, వినోదం, హాస్యం, లాస్యం ఇలా ఆయన ఏ పాట పాడినా అందరిని ఆకట్టుకునేది.

ఆయన రెండు సార్లు దర్శకుడిగా కూడా చేసారు. ఆయన దర్శకత్వంలో ప్రారంభమైన శివగంగ , రిక్షా వాలా సినిమాలు ఆర్ధిక చిక్క్లులకు లోనై మధ్యలోనే ఆగిపోయాయి.

ఆయన ఒక నట యోగి. అజాతశత్రువు. నాగయ్యలాంటి మహానుభావుడు సైతం నటనలో ఒక విధంగా సి ఎస్ ఆర్ ను తమకు గురువు అని చెప్పుకునే వారు.

Send a Comment

Your email address will not be published.