నమ్మకమే పునాది

నమ్మకమెప్పుడూ అమ్ముడు పోదనేది జగమెరిగిన సత్యం. సభ్యులు స్పష్టమైన, తిరుగులేని విజయానికి మొగ్గు చూపారంటే ఒక వ్యక్తిపై వున్న అపారమైన విశ్వాసానికి ప్రతీక. గెలుపు ఓటములు కావడి కుండలు. కానీ గెలుపనేది అలుపులేకుండా రాదు. తనపై షుమారు 85 శాతం సభ్యలు నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారంటే అది ఒక్కరోజులో జరిగేది కాదు. కొన్ని సంవత్సరాలు చెమటోడ్చి కష్టపడి నిస్వార్ధంతో సంపాదించుకున్న సంపద.

ఈ రోజు ప్రతిష్టాత్మకంగా జరిగిన Hindu Society of Victoria ఎన్నికల్లో మన తెలుగు తేజం శ్రీ హరి గూడూరు గారు అధ్యక్ష పదవికి విశిష్టమైన ఆదిఖ్యతతో గెలుపొందడం ఎంతో ముదావహం. మిగిలిన కార్యవర్గ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనా అధ్యక్ష పదవికి మాత్రం గత నాలుగు వారాలుగా అత్యంత రసవత్తరంగా జరిగిన పోటీలో సభ్యుల మన్ననలందుకొని విజేతగా నిలిచారు.

తన విజయానికి కారకులైన సభ్యులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన కార్యవర్గంతో కలిసి నిర్వహించనున్న భావి కార్యక్రమాలను వివరించారు. శివ విష్ణు మందిరాన్ని విక్టోరియా రాష్ట్రంలో ఒక పవిత్రమైన పుణ్య క్షేత్రంగానే కాకుండా ఒక ప్రసిద్ధమైన యాత్రా స్థలంగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. తెలుగుమల్లి ఈ వీరాదియోధునికి తన కార్య సాధనలో ఎల్ల వేళలో శుభం కలగాలని కోరుకుంటుంది.

1 Comment

  1. ” హిందూ సొసైటీ అఫ్ విక్టోరియా ” కు ప్రతిష్టాత్మకంగా జరిగిన అధ్యక్ష ఎన్నికలో శ్రీ హరి గూడూరు గారి గెలుపు సంతోషకరం . ఆయన సాత్వికత తో తన నిస్వార్ధ సేవలను అందించగలడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఆధ్యాత్మికత విస్తరణలో ఆయన తనదంటూ ఒక విశిష్ట స్థ్హానాన్ని పొందగలగాలని అభిలశిద్దాము.

Send a Comment

Your email address will not be published.