నల్ల ధనం గుట్టు విప్పాల్సిందే

విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా దేశంలోని బ్రిస్బేన్ నగరంలో జరిగిన జి-20 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పన్ను ఎగవేతదారులకు స్వర్గధామంగా వెలుగుతున్న దేశాలపై ఒత్తిడి తీసుకు రావాలని ఆయన కోరారు. ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడి వ్యూహంతోనే ఉగ్రవాదాన్ని మట్టుబెట్టాగలవని ఆయన అన్నారు. నల్లధనం కారణంగా  ఉగ్రవాదానికి కూడా ఊతం లభిస్తోందని, అగ్రరాజ్యాలు ఈ కోణంలో కూడా ఉగ్రవాదాన్ని అరికట్టడంపై ఆలోచించాలని ఆయన సూచించారు. అంతకు ముందు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్ మాట్లాడుతూ “ప్రపంచంలో అభివృద్ధిని కాంక్షించే ప్రజలంతా మన వైపు చూస్తున్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా మీరంతా మనసు విప్పి మాట్లాడండి” అని కోరారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా, చైనా, రష్యా, దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్ తదితర దేశాల అధిపతులు హాజరయ్యారు.

Send a Comment

Your email address will not be published.