నవరస నట తిలకం

Mohan Babuప్రముఖ రాజకీయ నాయకుడు టి సుబ్బరామ రెడ్డి జన్మదినం సందర్బంగా విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ నటుడు ఎం. మోహన్ బాబుకు ‘నవరస నట తిలకం’ బిరుదు ప్రదానం చేశారు. సుబ్బరంగా రెడ్డి జన్మదినం రోజునే మోహన్ బాబు తన 40 ఏళ్ల నట జీవితాన్ని కూడా పూర్తి చేసుకున్నారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీ జె కురియన్, చిరంజీవి, శ్రీదేవి, దాసరి నారాయణ రావు తదితరులు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ, మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, క్రమశిక్షణతో పెరిగిన తాను ప్లాట్ ఫారంపై బతికిన రోజులు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి, తాను మంచి స్నేహితులమని ఆయన చెప్పారు.

Send a Comment

Your email address will not be published.