నాదెండ్ల వరాలు

మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి సత్య నాదెండ్ల హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆయన తమ సంస్థ కార్యాలయాలను సందర్శించి, ఉద్యోగులను పలకరించిన తరువాత తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల సేపు ఈ సమావేశం జరిగింది. తెలంగాణా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి ఆయన ముందు అనేక ప్రతిపాదనలు ఉంచారు. అవసరమయితే తమ ప్రభుత్వం 600 ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, ప్రభుత్వ పరంగా ఎక్కడా ఎటువంటి ఆలస్యాలూ జరగవని ముఖ్యమంత్రి ఆయనకు హామీ ఇచ్చారు. సత్య కూడా సానుకూలంగానే స్పందించారు. తాము ఒక నిర్ణయం తీసుకునే వరకూ ఈ వ్యవహారాలను రహస్యంగానే ఉంచాలని సత్య కోరినట్టు తెలిసింది.

ఇది ఇలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కూడా ఆయన కలుసుకోబోతున్నారు. చంద్రబాబు ఇప్పటికే నాలుగయిదు ప్రాజెక్ట్ రిపోర్ట్ లను సిద్ధం చేసుకుని ఉన్నట్టు తెలిసింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో ఎక్కడయినా తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఎన్ని వందల ఎకరాల స్థలాన్నయినా ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు ప్రకటించారు.

Send a Comment

Your email address will not be published.