ఇంకెంత కాలమో!

నటిగా తాను మరెంత కాలం ప్రయాణం చేస్తానో   ఇప్పుడే చెప్పలేనని అంటోంది త్రిష.

హీరోలతో పోలిస్తే హీరోయిన్ లకు సిని కెరీర్ కాస్తంత తక్కువే అని చెప్పుకోక తప్పదు.

చెన్నైకి చెందిన త్రిష సినీ జీవితం ఇప్పటికే పదేళ్ళు దాటింది. అనేక తెలుగు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కలిగిన త్రిష తన అందంతోనూ, నటనతోనూ ఎందరినో ఆకట్టుకున్న సంగతి తెలిసినదే. అయితే ఇటీవల తెలుగులో అవకాశాలు తక్కువై మళ్ళీ తమిళ చిత్రాలపై దృష్టి సారించింది.

సెలెబ్రిటి క్రికెట్ లీగ్ లో చెన్నై ఆడే పోటీలకు హాజరై ఆ జట్టును తెగ ప్రోత్సహిస్తున్న త్రిష మునుపటి కన్నా అందంగా ముస్తాబై తానేమీ ఇప్పటికి తీసిపోలేదని చెప్పడానికి తాపత్రయపడుతోంది. తానింకా చురుగ్గానే ఉన్నానని చెప్పుకుంటున్న త్రిష ఆ మధ్య తనను ఎవరో ఒక విలేకరి కలిసి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఇప్పటికి పదేళ్ళు పైగానే తాను నటించానని, మసాలా సినిమాల్లో నటించి విసుగు పుట్టిందని, కనుక మంచి కథ, కథకు తగ్గ పాత్ర లభిస్తే నటించి అభిమానుల మనసులలో స్థిరమైన చోటు  సంపాదించుకోవాలనుందని చెప్పింది. అయితే మరెంత కాలం తన సిని జీవిత  ప్రయాణం సాగుతుందో  మాత్రం  ఇప్పుడే చెప్పలేనని ఆమె తెలిపింది. అవకాశాలు ఉన్నంతకాలం నటిస్తానని చెప్పింది. తెలుగు చిత్ర రంగంలో తాను అగ్ర హీరోల సరసన నటించినందుకు  తృప్తిగా ఉందని త్రిష వివరించింది.

Send a Comment

Your email address will not be published.