నితిన్ కపూర్ అనుమానాస్పద మృతి

nithin-kapoorప్రముఖ సీనియర్ సినీ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలో అనుమానాస్పదంగా మృతి చెందారు. విషయం తెలియడంతోనే జయసుధ ముంబైకి బయలుదేరారు.

నితిన్ కపూర్ నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. నితిన్ కపూర్ మరణానికి కారణాలేమిటో తెలియవలసి ఉంది.

ఆయన వయస్సు యాభై ఎనిమిదేళ్ళు. బాలీవుడ్ ప్రముఖ నటుడు జితేంద్ర సోదరుడు అయిన నితిన్ కపూర్ 1985 లో జయసుధను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారి పేర్లు – నిహార్, శ్రేయాస్.

నితిన్ కపూర్ మరణంతో అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.

నితిన్ కపూర్ మధ్యాన్నం రెండు గంటల ప్రాంతంలో మృతి చెందారు. అయినప్పటికీ ఈ విషాద వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని ఓ వర్గం అంటుంటే కొన్ని కారణాలతో ఆయన డిప్రెషన్ లో ఉన్నారని, అందుకు చికిత్స కూడా తీసుకుంటున్నారని సమాచారం.

ఆయన ముంబైలో తన సోదరి ఇంట్లో ఉండగా జయసుధ హైదరాబాద్ లో ఉంటున్నారు.

ఆయన సినీ పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజుల్లో సహాయ దర్శకుడిగా ఉండేవారు. ఆ తర్వాత ఆయన జయసుధతో పలు సినిమాలు నిర్మించారు.

ఆయన 2000 లో హాండ్స్ అప్ అని ఓ సినిమా నిర్మించారు. అలాగే మరికొన్ని చిత్రాలు కూడా తీసిన నితిన్, జయసుధలది ప్రేమ వివాహం. వీరు రెండేళ్ళు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు.
అప్పుడేప్పుడు వీరిద్దరూ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇలా చెప్పుకున్నారు –

జయసుధ – ఆయనను చూసిన తొలి రోజు నుంచే ఇష్టపడ్డాను. ఆయన చూడ్డానికి ఎంతో చక్కగా ఉండేవారు. ఆయ నన్ను కట్టిపడేశారు అని నేను చెప్పకుంటే అబద్ధమే అవుతుంది. అయితే అదేమీ తొలి చూపులోనే ప్రేమించుకున్న బాపతు కాదు. అయితే ఆయనతో కలిసి ఉండటం బాగుండేది.

నితిన్ – మేమిద్దరం మంచి మిత్రులం. మా ఇద్దరి మధ్య కథనం నేను ముంబైకి, చెన్నై కి మధ్య ప్రయాణం చేసినప్పుడు ప్రారంభం అయింది. ఒకరినొకరు చూసుకోకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అయ్యే వాళ్ళం.

Send a Comment

Your email address will not be published.