నిశ్శబ్దంలో ఓంకారం

RB Ceremony 5

Welcome speechహిందూ మతంలో శంఖారావం ఒక మహోన్నత కార్యారంభానికి శుభసూచకం. లింగ బేధం లేకుండా స్త్రీ, పురుష, యువత సమన్వయంతో చేపట్టిన శంఖాన్నే చిహ్నంగా హిందూ ధర్మాలను త్రికరణ శుద్ధిగా పాటిస్తున్న పలు సంస్థలకు భిన్నత్వంలో ఏకత్వాన్ని బోధిస్తున్న ఆశాకిరణం హోతా (HOTA – Hindu Organisations, Temples and Associations). ఏ మత విధానాలతోనైనా మమేకం కాగల హిందూ ధర్మాలను భావితరాలకు అందివ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థలన్నింటినీ ఒకే గొడుగు క్రింద నిలపాలన్న సంకల్పంతో ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. విక్టోరియా రాష్ట్రంలో గత ఏడాది ప్రారంభించిన ఈ సంస్థలో ఇప్పటికే 50కి పైగా సంస్థలు సభ్యులుగా చేరారని ఈ సంస్థ కార్యదర్శి శ్రీ శర్మ బేతనభట్ల గారు చెప్పారు. హోతా మార్గదర్శక బాధ్యతను చేపడుతుంది తప్ప సభ్య సంస్థల కార్యకలాపాలకు దూరంగా ఉంటుందని వారు వివరించారు.
ముఖ్యంగా యువతను ప్రోత్సహించి ధార్మిక కార్యక్రమాలలో పాలుపంచుకోనేలా చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు హోతా అధ్యక్షురాలు శ్రీమతి గీతా మద్దిపట్ల గారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు యువకులు వాచాస్పతులుగా వ్యవహరించి సమర్ధవంతంగా నిర్వహించిన తీరు ఎంతో ఆసక్తిని కలిగించింది. హిందూ సంప్రదాయానికి అనుగుణంగా దీప ప్రజ్వలన, ప్రార్ధనా గీతం పాడిన తదుపరి రక్షా బంధన్ యొక్క ప్రాముఖ్యతను శ్రీమతి గీతా దేవి గారు వివరించారు. విక్టోరియా రాష్ట్రంలోని షుమారు 85,000 మంది హిందువులు మన హిందూ ధర్మ విలక్షణతను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత సమకాలీన పరిస్థితులకు అన్వయించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సంవత్సరం “Tejaswini – Woman of Substance” అవార్డును శ్రీమతి రోహిణి కప్పడత్ (Chair of the Multicultural Ministerial Business Advisory Council) గారికి అందజేయడం జరిగింది.

H host 17-1ఈ కార్యక్రమానికి ప్రత్యెక అతిధిగా విక్టోరియన్ మల్టీ కల్చరల్ కమీషనర్ Dr. Mimmi Claudiene Ngyum Chi Watts వచ్చారు. Dr. Watts మాట్లాడుతూ బహుళ సంస్కుతుల సమ్మిళితమైన ఆస్ట్రేలియాకు ప్రవాసీయులే ఆయువు పట్టని అభివర్ణించారు.

రాఖీ పండగను సాంప్రదాయపరంగా శ్రీమతి మహిత చెరుకువాడ గారు జరిపించడం ముదావహం. ఈ విభాగంలో గౌతమ్ గుప్త, Dr. Watts మరియు Victoria Police community Engagement Manager Ms. Rosa Rossi గార్లు పాల్గొన్నారు.

K martial artsసాంస్కృతిక కార్యక్రమాల విభాగంలో శ్రీమతి మేఘల భట్ భరత నాట్యంతో ప్రేక్షకులందరినీ మంత్రముగ్దులను చేసారు. కలారి హీలింగ్ వారు కేరళలోని ప్రాచీనమైన కలారిపయట్టు అనే మార్షల్ ఆర్ట్స్ ని ప్రదర్శించడం జరిగింది. శ్రీరాం అయ్యర్ పాడిన దేశ భక్తీ గీతాలతో సాంస్కృతిక కార్యక్రమం ముగిసింది.

వచ్చే సంవత్సరం ఇండియా – ఆస్ట్రేలియా ఎక్స్చేంజి ఫోరం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Send a Comment

Your email address will not be published.