నేటి నుంచి రాష్ట్రపతి పాలన

విభజన తరువాత రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి వెళ్ళింది. నాలుగు దశాబ్దాల తరువాత  మళ్ళీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1954లో మొదటిసారి, 1973లో జై ఆంద్ర ఉద్యమ సమయంలో రెండవసారి, ఇప్పుడు రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రి రాజీనామాతో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో మూడవసారి రాష్ట్రపతి పాలన అవసరమైంది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తరువాత షుమారు 15 రోజులకి కాంగ్రెస్ తర్జన భర్జన అయిన తరువాత ఈ నిర్ణయం తీసుకొంది.  రాష్ట్ర విభజన చేసి రాష్ట్రపతి పాలన విధించడం పురిటిలోనున్న తల్లిని చంపినట్లేనని భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి శ్రీ నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.  అయితే ఈ పరిష్టితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంతకంటే గత్యంతరం లేదని పలువురు రాజకీయ వ్యాఖ్యాతలు చెబుతున్నారు.

Send a Comment

Your email address will not be published.