పట్టపగలు బ్రేక్?

నటి స్వాతి దీక్షిత్ బ్రేక్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది.
రామ్ గోపాల్ వర్మ చిత్రమైన పట్టపగలులో నటించిన స్వాతి దీక్షిత్ ఈ చిత్రంపై ఎనలేని ఆశలు పెట్టుకుంది. బ్రేక్ అప్ అనే తన తొలి సినిమాలో నటించిన స్వాతి దీక్షిత్ కు చెడు అనుభావమే మిగిలింది. ఆ సినిమా దారుణంగా విఫలమైంది. ఆ చిత్రంలో ఆమె సతీష్ ముత్యాలతో పని చేసింది. అయితే ఆ చిత్రం ట్రైలర్ తీసుకు వెళ్లి ఆమె రామ్ గోపాల్ వర్మకు చూపించింది. “అది చూసిన రామ్ గోపాల్ వర్మ ఒక రోజు పట్టపగలు చిత్రం తాలూకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు పూర్తిగా విన్నాను. ఈ కథ నచ్చిందా అని ఆయన అడిగారు. ఆ కథ నాకు ఎంతగానో నచ్చింది. ఆశ్చర్యమేసింది అని జవాబిచ్చాను. వెంటనే ఆ సినిమా చెయ్యడానికి సంతకం చేసాను. ఆ తర్వాత చిత్రీకరణ మొదలైంది” అని స్వాతి దీక్షిత్ తెలిపింది.
అయితే ఆ చిత్రంలో స్వాతి చెయ్య వలసిన పాత్ర దెయ్యం పాత్ర. దెయ్యంగా నటించడంలో ఆమెకు అప్పటి వరకు ట్రైనింగు లేదు. అనుభవం లేదు. అసలు ఆమెకు దెయ్యాలంటే చచ్చేంత భయం. పైగా అప్పటి వరకు ఆమె హర్రర్ చిత్రాలు చూడ లేదు కూడా. కానీ రామ్ గోపాల్ వర్మ చిత్రం కావడంతో ఒప్పుకుంది. కానీ ఎలా చెయ్యాలి ఆ పాత్ర? తన ప్రతిభను రుజువు చేసుకోవాలి అనే ఏకైక లక్ష్యంతో స్వాతి దీక్షిత్ పట్టపగలు చిత్రంలో చెయ్యడానికి అంగీకరించింది.
పట్టపగలు చిత్రీకరణ సమయంలో రా గోపాల్ వర్మ ఆమెకు పూర్తిగా సహకరించి దెయ్యం పాత్రలో నటింప చేసారు. ఎక్కడ ఏ సన్నివేశంలో ఎలా నటించాలో ఆయన పూస గుచ్చినట్లు చెప్పారు. మేకప్ సెషన్స్ తర్వాత తనను తాను అద్దంలో చూసుకోవడానికి ఆమెకు ధైర్యం చాలలేదట. ఒకవేళ అలా అద్దంలో చూస్తే తనకు భయమేస్తుందని తెలిసి ఆ ప్రయత్నం చెయ్యలేదట. అ చిత్రంలో ఒక సీనులో నటించడమైతే నటించింది కానీ ఆమెకు ఇప్పుడు తలచుకున్నా భయమేస్తోందట. ఆ పాత్ర చిత్రీకరణ అప్పుడు ఆమె పెద్దగా అరిచి రాజశేఖర్ సార్ ని తిట్టేసిందట. ఆ షూటింగ్ తర్వాత లొకేషన్ లో ఉన్న వాళ్ళందరూ తనవైపు ఒక నిజమైన దెయ్యాన్ని చూస్తున్నట్టే చూసేరట.  అప్పుడు ఆమెకు చాలా భయమేసిందట. ఆ మరుక్షణం ఆమె రామ్ గోపాల్ వర్మ వైపు చూసింది. ఆయన స్వాతి నటన చూసి చప్పట్లు కొట్టి ప్రోత్సహించడంతో ఆమె మళ్ళీ యధాస్థితికి వచ్చింది.
పట్టపగలు సినిమాలో నటిస్తే నటించింది కానీ వాస్తవ జీవితంలో ఆ దెయ్యం పాత్ర గుర్తుకు వస్తున్నప్పుడల్లా ఆమెకు అదోలా అనిపిస్తోందట. ముఖ్యంగా ప్రతి రాత్రి ఆమెను ఏదో వెంటాడుతున్నట్టే అనిపిస్తోందట. ఈ చిత్రంలోని ప్రతీ సీను ఆమెకు బాగా గుర్తుందట. జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను అని చెప్పింది. దాదాపు రెండు నెలలైతే రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టలేదట.
ఆర్ జీ వీ, రాజశేఖర్ లతో కలిసి పని చెయ్యడం గురించి మాట్లాడుతూ ఆర్ జీ వీ కోల్ పర్సన్ అని స్వాతి చెప్పింది. సెట్స్ లో రాజశేఖర్ తనకు అన్ని విధాలా గైడ్ చేసేరట.
తన ఫ్యామిలీ, మిత్రులు తన వర్క్ ను కొనియాడారట.

Send a Comment

Your email address will not be published.