ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధానిని నిర్ణయించడానికి వేసిన శివరామకృష్ణన్ కమిటీ వారం రోజుల్లో తన నివేదికను కేంద్రానికి సమర్పించబోతోంది. అంటే పది రోజుల్లో రాజధాని ఎక్కడన్నది తేలిపోతుంది. కమిటీ నివేదిక మీద రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. మొదట ఆంధ్ర ప్రాంతం లోనూ, ఆ తరువాత రాయలసీమలోనూ పర్యటించిన ఈ కమిటీ తన నివేదిక ముసాయిదాను ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ఆరంభించాలంటే రాజధాని ఎక్కడన్నది తేలాల్సి ఉంటుంది.
రాజధాని ఎక్కడ ఏర్పాటయినా తాను మాత్రం విజయవాడ, గుంటూరు నగరాలలోనే ప్రస్తుతానికి ఎక్కువ సమయం గడపదలచుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఇది ఇలా వుండగా, రాష్ట్రంలో గోదావరి నది మీద నిర్మించబోయే పోలవరం ప్రాజెక్టుకు తారకరామ సాగర్ అని పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది.