పద్మశ్రీలను ఇచ్చేయండి!

పద్మశ్రీ బిరుదుల్ని వెనక్కు ఇచ్చేయాల్సిందిగా రాష్ట్ర హై కోర్ట్ ప్రసిద్ధ నటులు బ్రహ్మానందం, మోహన్ బాబులను ఆదేశించింది. వారం రోజుల్లోగా ఈ బిరుదుల్ని తిరిగి ఇచ్చేయని పక్షంలో శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కూడా కోర్ట్ స్పష్టం చేసింది.  పద్మశ్రీలను బిరుదులుగా ఉపయోగించుకోకూడదని సుప్రీమ్ కోర్టు గతంలో ఆదేశాలు జారీచేసినప్పటికీ ఈ ఇద్దరు నటులు ‘దేనికయినా రెడీ’ చిత్రంలో వీటిని వాణిజ్య ప్రయోజనాల కోసం  ఉపయోగించుకున్నారని రాష్ట్ర బీజేపీ నాయకుడు ఇంద్రసేనా రెడ్డి హై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఇద్దరు నటులూ ఈ బిరుదుల్ని ఇంటి పేర్ల మాదిరిగా వాడుకుంటున్నారని కూడా ఆయన ఆరోపించారు.

హై కోర్టు ఆయన పిటిషన్ను విచారణకు స్వీకరించి వారిద్దరినీ కోర్టుకు పిలిచింది. వారం రోజుల్లో బిరుదుల్ని తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఇంద్రసేనా రెడ్డి ఈ నటుల మీద ఎందుకు పిటిషన్ వేశారన్నది అర్థం కావడం లేదు. అయితే ‘దేనికైనా రెడీ’ చిత్రం విడుదల సందర్భంగా మోహన్ బాబుకు, బ్రాహ్మణ కులస్తులకు మధ్య ఏదో రభస జరిగిందనీ, వారి ఒత్తిడి కారణంగానే రెడ్డి ఇలా పిటిషన్ వేశారని చెబుతున్నారు. రాష్ట్రంలోని శక్తివంతమైన బ్రాహ్మణ సంఘాలతో రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు కూడా తెలిసింది.  ఒక్క మోహన్ బాబును మాత్రమే ఇందులో చేర్చకుండా బ్రహ్మానందం  పేరును కూడా ఇందులో చేర్చడానికి కారణం  వారిద్దరూ సన్నిహిత మిత్రులు కావడం, పైగా ఈ ఇద్దరూ బిరుదుల్ని ఉపయోగించుకోవడం అని తెలిసింది.

Send a Comment

Your email address will not be published.