పరమశివుడి అష్టమూర్తులు

Lord-Shiva

ఒకటి –
పృధ్వీ తత్వలింగమైన ఏకామ్రేశ్వరుడు – దక్షిణ భారతదేశంలోని శివకంచిలో కొలువై ఉన్నాడు. కాంచీపురానికి దగ్గరలోని సర్వ తీర్థం అనే సరోవరం తీరాన ఈ స్వామి ఉన్నాడు.
ఇక్కడి శివలింగం నలుపు రంగులో ఉంటుంది. దీని వెనుక పార్వతీపరమేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారికి జలంతో అభిషేకం చేయరు. మల్లెపూలు, సుగంధ తిలాలతో అభిషేకం చేస్తారు.

రెండు –
జలతత్వ లింగమైన జంబుకేశ్వరుడు – తిరుచిరాపల్లి శ్రీరంగం నుంచి కొంత దూరంలో ఓ జలప్రవాహం మీద ఈ స్వామి లింగం ఉంది. లింగం కింది నుంచి పైకి జాలం ఊరుతూ ఉంటుంది. ఆలయం బయట జంబూ వృక్షాలు ఉన్నాయి.

మూడు –
తెజోతత్వ లింగం అయిన అరుణాచలేశ్వరుడు – తమిళనాడులోని అరుణాచల క్షేత్రంలో ఈ స్వామి ఉన్నాడు. ఇక్కడ పార్వతీదేవి కొంత కాలం తపస్సు చేసింది. ఇది పురాణ గాథ. ఆమె తపస్సుతో అగ్నిశిఖ రూపంలో తేజో లింగం ఉద్భవించినట్టు చెబుతారు.

నాలుగు –
వాయు తత్వ లింగమైన శ్రీకాళహస్తీశ్వరుడు – తిరుపతికి దగ్గరలోని స్వర్ణముఖి నదీ తీరాన వాయులింగ రూపంలో ఉన్నాడు ఈ స్వామి. ఇక్కడి శివుడు వాయువీచిక రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడి శివమూర్తి నలుచదరంగా కనిపిస్తాడు. ఇక్కడి స్వామిని మున్ముందుగా సాలీడు, సర్పం, ఏనుగూ పూజించాయన్నది కథనం.

అయిదు –
ఆకాశ తత్వ లింగమైన చిదంబరేశ్వరుడు – దక్షిణ భారత దేశంలోని చిదం బరంలోని ఈశ్వరుడు ఆకాశ తత్వానికి సంకేతం. కావేరీ నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. గర్భగుడిలో ఏ విగ్రహమూ లేదు. ఇది నీలాన్ రంగులోని శూన్యాకాష తత్వలింగం. ఇక్కడ సాధారణంగా తెర వేసే ఉంటుంది.

ఆరు –
పశుపతినాథుడిగా కనిపించే యజమానమూర్తి – ఈ ఆలయం నేపాల్ లో ఉంది. పశుపతినాధుడు లింగ రూపంలో కాకుండా మానుష విగ్రహరూపంలో ఉంటాడు. ఇక్కడ శివుడు గుట్టుగా నివసించేవాడు. బ్రహ్మదేవుడు విష్ణువుతో కలిసి వచ్చి స్వయంభూ దర్శనం చేసుకుని స్తుతించినట్టు చెప్తారు.

ఏడు –
చంద్రమూర్తి – గుజరాత్ లోని కథయవాడలో సోమనాథ్ – బెంగాల్ లోని చీట్ గావ్ దగ్గర ఉన్న చంద్రనాథ జ్యోతిర్మయ స్వరూపం శివుడి చంద్రమూర్తి ప్రీతికలు. ఈ రెండు క్షేత్రాలలో శివుడు చంద్ర రూపంగా పూజలు అందుకుంటున్నాడు.

ఎనిమిది –
సూర్యమూర్తి – సూర్యభగవానుడి ప్రతి మందిరం పరమశివుడి సూర్యమూర్తి తత్వాన్ని ప్రకటిస్తుంది. ఆదిత్యుడు సర్వసాక్షి అన్న సంగతి తెలిసిందే కదా. పైగా ప్రత్యక్ష దైవం. శివుడికీ సూర్యుడికీ ఏమీ తేడా లేదు.

Send a Comment

Your email address will not be published.